ఇటీవల కొంతమంది చిన్న చిన్న సహనం కోల్పోతున్నారు.. ఆ క్షణంలో విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఇక మద్యం సేవించిన వాళ్ల పరిస్థితి మరీ దారుణం.. పీకల దాకా తాగి ఎదుటి వారిపై గొడవకు దిగడం.. కొట్టడం.. హత్యలు చేయడం లాంటివి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల తరుచూ జరుగుతున్నాయి.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మద్యం మత్తులో కొంతమంది నడిరోడ్లపై వీరంగం సృష్టిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అంటూ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో కొంతమంది మందుబాబులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. కొన్నిసార్లు పోలీసులపై తిరగబడటం.. దుర్భాషలాడటం లాంటివి చేస్తుంటారు. తాజాగా ఓ యువకుడు పోలీసులపై దాడికి పాల్పపడ్డారు.. ఈ దాడిలో పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఈ మద్య కొంతమంది మందుబాబులు రోడ్లపై వీరంగం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో మందుబాబులను నిలువరించడానికి వెళ్లిన పోలీసులపై ఎదురు తిరిగి వారిపై దాడులు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ యువకుడు పీకలదాకా మద్యం సేవించి వీరంగం సృష్టించాడు. బోధన్ పట్టణంలో ఆదివారం రాత్రి ఓ యువకుడు ఫుల్లుగా మద్యం సేవించి నడిరోడ్డుపై హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో రోడ్డు పై వస్తున్నవారిపై దుర్భాషలాడుతూ గొడవ చేయడం మొదలు పెట్టాడు. దాంతో రోడ్డుపై వస్తున్న కొంతమంది తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. స్థానికులు కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మద్యం సేవించిన వ్యక్తిని సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ ఫూటుగా తాగి ఉన్న ఆ వ్యక్తి పోలీసులను సైతం దుర్భాషలాడటం మొదలు పెట్టాడు. అయినా సహనంతో అతనిని ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని చెబుతున్న సమయంలో పోలీసులపై ఒక్కసారిగా దాడికి పాల్పపడ్డాడు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు కొంతమంది కలుగ చేసుకొని మద్యం సేవించిన వ్యక్తిని గట్టిగా పట్టుకోవడంతో పోలీసుల అతన్ని స్టేషన్ కి తరలించారు. సదరు వ్యక్తి పేరు షేక్ అబు.. బోధన్ లో రౌడీ షీటర్ గా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో దాడి, గొడవ చేసిన కారణంగా నింధితుడిపై 307 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో ఇతడిపై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.