తెలుగు రాష్ట్రాల్లో మెడికో ప్రీతి ఆత్మహత్య కేసు సంచలనం మారింది. ఆమెది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికి హత్యే అని ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. ప్రీతి మరణించి వారం అవుతున్నా.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మెడికో ప్రీతి ఆత్మహత్య కేసు విషయంపై తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రీతి మృతి చెంది వారం గడుస్తున్నప్పటికీ ఈ కేసు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రీతి కేసు సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ప్రీతి అసలు ఎంజీఎం ఆసుపత్రిలోనే చనిపోయిందని.. ఆ విషయం చెబితే ప్రజలు తిరగబడతారని ప్రీతి డెడ్ బాడీని నీమ్స్ ఆస్పత్రికి తరలించి నాలుగు రోజులు ట్రీట్ మెంట్ చేశారని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రీతి ది ఆత్మహత్య కాదు.. ఇది ముమ్మాటికీ హత్యే అని ఆరోపించారు.
తెలంగాణలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతన్న అత్యాచారాలకు నిరసనగా ఒకరోజు దీక్ష చేశారు బండి సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చనిపోయిన ప్రీతికి 4 రోజులపాటు.. ట్రీట్ మెంట్ చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. ప్రీతి మృతి కేసుపై ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ప్రభుత్వం నింధితుడిని కాపాడే యత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది.. ఆధారాలు తారుమారు అవుతున్నాయని అనుమానాలు వస్తున్నాయని అన్నారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అని ప్రశ్నించారు. ప్రీతి ఎంతో ధైర్యవంతురాలని.. ఆత్మహత్య చేసుకునేంత పిరికితనం ఆమెలో లేదని కుటుంబ సభ్యులు, స్నేహితులు అన్నారని.. అలాంటి అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుందని ప్రశ్నించారు.
ప్రీతి ఎందుకు చనిపోయింది.. ఎలా చనిపోయిందన్న విషయంపై ఇప్పటి వరకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదని.. ఎందుకు నిజాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని.. ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైల్లోకి తోస్తున్నారని విమర్శించారు. మహిళల భద్రత కోసం బీజేపీ పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. శవాలను ఎత్తుకు వెళ్లి రాజకీయం చేసే నీచమైన సంస్కృతి కేసీఆర్ ప్రభుత్వానికి అని విమర్శించారు. చనిపోతే సంతాపం.. బతికుంటే పరిహారం అన్న చందంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. ఆడబిడ్డలు చనిపోతే పరామర్శించడం లేదు.. ప్రగతి భవన్ నుంచి బయటకు రావడం లేదు.. ఇది సీఎం కేసీఆర్ కే చెల్లుబాటు అవుతుందని ఆయన తీరును ఎండగట్టారు బండి సంజయ్. ఇప్పటికైనా ప్రీతి కేసు విషయంలో చర్యలు తీసుకోవాలని.. లేదంటా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రీతి కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు.