Disha Encounter: మూడేళ్ల క్రితం జరిగిన దిశ ఎన్‌కౌంటర్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దిశ కేసులో నిందితులైన ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. 2019 డిసెంబర్ 6వ తేదీ తెల్లవారు జామున ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. దేశం మొత్తం సీపీ సజ్జనార్‌ను, ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను పొగడ్తలతో ముంచెత్తింది. ముఖ్యంగా మహిళాలోకం ప్రశంసలతో వారిని ముంచెత్తింది. అయితే, ఈ ఎన్‌కౌంటర్ బూటకపు ఎన్‌కౌంటర్ అని ఆరోపిస్తూ న్యాయవాదులు జి.ఎస్.మణి, ప్రదీప్‌కుమార్ యాదవ్‌లు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో సీజీఐ ఎస్.ఎ.బోబ్డే సారథ్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.ఎస్.సిర్పూర్కార్ సారథ్యంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
రెండేళ్ల పాటు దర్యాప్తు చేసిన ఈ కమిషన్ తాజాగా తమ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేసింది. దిశ ఎన్‌కౌంటర్ బూటకపు ఎన్‌కౌంటర్ అని నివేదికలో పేర్కొంది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 10 మంది పోలీసులు- వి.సురేందర్, కె.నరసింహారెడ్డి, షేక్ లాల్ మదార్, మొహమ్మద్ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవి, కె.వెంకటేశ్వర్లు, ఎస్.అరవింద్ గౌడ్, డి.జానకిరామ్, ఆర్.బాలు రాథోడ్, డి.శ్రీకాంత్‌లను ఈ నేరానికి గాను సెక్షన్ 302 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ, 201 ఆర్/డబ్ల్యూ 302 ఐపీసీ, 34 ఐపీసీ ప్రకారం విచారించాలని కమిషన్ అభిప్రాయపడింది.
ఎన్‌కౌంటర్‌ను సమర్థించటానికి ప్రయత్నించిన షేక్ లాల్ మదార్, మొహమ్మద్ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవిలను ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం విచారించాలని కమిషన్ అభిప్రాయపడింది. కాగా, 2019, నవంబర్ 27న దిశ అనే వెటర్నరీ డాక్టరపై ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు అత్యాచారం చేసి, ఆపై పెట్రోల్ పోసి కాల్చి నిప్పంటించారు. ఈ సంఘటనపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అయ్యింది. మృగాళ్లకు ఎన్‌కౌంటరే సరైన శిక్ష అని ప్రజలు భావించారు. మరి, దిశ ఎన్‌కౌంటర్ పై కమిషన్ ఇచ్చిన నివేదికపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Kidney Stones: షాకింగ్ న్యూస్ : నల్గొండ వాసి కిడ్నీలో 206 రాళ్లు..