నేటికాలంలో చాలా మందిలో ఆత్మవిశ్వాసం, మానసిక స్థైర్యం అనేవి కొరవడినాయి. అందుకే ప్రతి సమస్యకు భయపడి పోతుంటారు. అన్ని అవయవాలు సరిగ్గా పని చేస్తున్న వారే.. జీవితంలో ఎదరయ్యే సమస్యలకు ఆందోళన చెందుతుంటారు. అయితే ఇలాంటి వారందరు ఓ వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలి.
నేటికాలంలో చాలా మందిలో ఆత్మవిశ్వాసం, మానసిక స్థైర్యం అనేవి కొరవడినాయి. అందుకే ప్రతి సమస్యకు భయపడి పోతుంటారు. ఇక కొందరు ఏ చిన్న కష్టం వచ్చిన భయపడి పోయి.. డిప్రెషన్ లోకి వెళ్తుంటారు. శరీరంలో అన్ని అవయవాలు సరిగ్గా పని చేస్తున్న వారే.. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఆందోళన చెందుతుంటారు. అయితే ఇలాంటి వారందరు ఓ వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలి. విధి ఆడిన వింత నాటకంలో తన రెండు చేతులు పోయినా.. ధైర్యంతో ముందడుగు వేశాడు. మొండి చేతులతోనే చోదక వృతితో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనే కుమురం భీమ్ జిల్లాకు చెందిన ప్రశాంత్ గౌడ్. మరి.. ఆయన లైఫ్ స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కుమురం భీం జిల్లా రెబ్బాలకు చెందిన లింగంపల్లి లక్ష్మీనారాయణ గౌడ్, కవిత దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో పెద్ద కుమారుడు ప్రశాంత్ గౌడ్.. పదవ తరగతి వరకు చదువుకున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో ఓ పెట్రోల్ బంకులో ప్రశాంత్ గౌడ్ పని చేస్తుండేవారు. 2011లో సకల జనుల సమ్మె సమయంలో ప్రశాంత్ పని చేసే పెట్రోల్ బంక్ లు మూసివేశారు. ఆ సమయంలో బంకు వద్ద నుంచి ఇనుప నిచ్చెన తీసుకెళ్తుండగా.. అది ప్రమాదవశాత్తు 33 కేవీ విద్యుత్తు తీగలను తాకింది. ఈ క్రమంలో ప్రశాంత్ గౌడ్ కి కరెంట్ షాక్ కొట్టడంతో ఆయన రెండు చేతులు కోల్పోయారు. అప్పటి నుంచి జీవనం కోసం చిరు వ్యాపారం చేసేందుకు చిన్నపాటి దుకాణం ఏర్పాటు చేసుకోన్నారు.
ఇక 2016లో అపర్ణ అనే యువతిని ప్రశాంత్ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. ఆయనకు భార్య సాయంగా ఉండటంతో నష్టపరిహారం కింద వచ్చిన డబ్బులతో తొలుత ట్రాలీ కొనుగోలు చేశాడు. ఆ ట్రాలీని నడుపుతూ వచ్చిన డబ్బులతో ఒక కారు కొన్నారు. కొన్నాళ్లకు మరో కారు కూడా కొనుగోలు చేశారు. ఆ రెండు వాహనల ద్వారా వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటూ ప్రశాంత్ ఆదర్శంగా నిలుస్తున్నారు. రెండు చేతులు కోల్పోయిన ప్రశాంత్ మనోధైర్యం మాత్రం కోల్పోలేదు.
ఒకరికి భారం కాకుండా తన కాళ్ల మీద తానే నిలబడాలని నిశ్చయించుకున్నాడు. అందులో భాగంగానే మొండి చేతులతో వాహనం నడపడం కూడా నేర్చుకున్నాడు. రెండు సార్లు డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నని, అన్ని టెస్టులు పాసైనా .. నిబంధనల ప్రకారం అనుమతి ఇవ్వలేమని అధికారులు అన్నట్లు ప్రశాంత్ పేర్కొన్నారు. అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నా.. వాహనం నడిపేందుకు కొందరు జంకుతుంటారు. ప్రశాంత్ మాత్రం మొండి చేతులతోనే చోదక వృతిలో ఔరా అనిపిస్తున్నారు. మరి.. విధినే ఎదిరించిన ఈ వీరుడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.