తమకి తలకాయ లేదన్న విషయం అందరికీ తెలియాలని హెల్మెట్ పెట్టుకోవడం మానేసేవారు కొందరు, కుటుంబంపై బాధ్యత లేదని అందరికీ తెలియాలని మద్యం సేవించి వాహనం నడిపేవారు కొందరు. “హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, మద్యం సేవించి వాహనాలు నడపకండి” అని పోలీసులు ఎంత చెప్పినా గాని ఈ నిర్లక్ష్యపు బ్యాచ్ కి అర్ధం కాదు. వీళ్ళ ప్రాణం గురించి పోలీసులు ఆలోచించాల్సి వస్తుంది. చలానాలు విధించినా, వాహనాలు సీజ్ చేసినా మనుషుల్లో మార్పు అనేది రావడం లేదు.
మద్యం తాగితే కొన్ని రోజుల తర్వాత ప్రాణం పోతుంది. కానీ మద్యం తాగి బండి నడపడం వల్ల ఈరోజే పోయే అవకాశం ఉంది. అది నడిపే వాడి ప్రాణమైనా కావచ్చు. బండి కింద పడ్డ వారి ప్రాణమైనా కావచ్చు. ఈ నష్టాన్ని అరికట్టేందుకే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. కానీ మందు బాబులు పోలీసులకు సహకరించడం లేదు. సహకరించకపోగా రువాబు చేస్తున్నారు.
వీఐపీలు, సెలబ్రిటీలు, సామాన్యులని తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ తాగి రోడ్డు మీద గోల గోల చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ఓ దివ్యాంగుడు కూడా చేరిపోయాడు. హైదరాబాద్ లోని మలక్ పేటలో రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఓ దివ్యాంగుడు చుక్కలు చూపించాడు. మద్యం సేవించి కారు నడుపుతున్న దివ్యాంగుడ్ని ఆపినందుకు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. పోలీస్ షర్ట్ కాలర్ పట్టుకుని.. బూతులతో విరుచుకుపడ్డాడు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకుండా వారిపై రెచ్చిపోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అతని వాహనాన్ని సీజ్ చేశారు. మరి ఈ దివ్యాంగుడు చేసిన పనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Bollywood: భర్తపై ముద్దుల వర్షం కురిపించిన నటి.. ఫోటోలు వైరల్..
ఇది కూడా చదవండి: వానదేవుడిపై చర్యలు తీసుకోవాలంటూ రైతు లేఖ.. పై అధికారికి సిఫార్సు చేసిన రెవెన్యూ అధికారి!