నేటికాలంలో నేరాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అమయాకులను నమ్మించి మరీ కొందరు నట్టేట ముంచుతున్నారు. ఉద్యోగాల వేటల ఉన్న యువత టార్గెట్ గా చేసి మోసాలకు పాల్పడుతున్నారు. యువత బలహీనతను ఆసరాగ చేసుకుని వారిని నుంచి కోట్లు రూపాయాలు వసూలు చేసి చివరికి మోసం చేస్తున్నారు. తాజాగా ఉద్యోగాల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం పేరుతో ఒక్కొక్కరి నుండీ లక్షల రూపాయలు వసూలు చేసింది ఓ ప్రైవేటు కంపెనీ. దాదాపు 700 మంది ఈ మోసానికి గురయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో చోటుచేసుకుంది.
హైదరాబాద్ లోని అమీర్ పేట డిజినల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేసిన కేటుగాళ్లు.. నిరుద్యోగులకు గాలం వేశారు. ఆన్ లైన్ జాబ్, వర్క్ ఫ్రం హోం, యూఎస్ బేస్డ్ కంపెనీల్లో ఉద్యోగాలిప్పిస్తామని ఆ సంస్ధ నిరుద్యోగులకు ఆశ కల్పించింది. ఒక పేజీ స్కాన్ చేస్తే రూ.5 చెల్లిస్తామని చెప్పడంతో వందల మంది ఆసక్తి చూపారు. జుబ్లీహిల్స్ ప్రాంతంలోని డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటేడ్ కంపెనీ ఆఫీస్ ను తెరిచారు. నెల రూ.3 లక్షల జీతం అంటూ నిరుద్యోగులకు వల వేశారు. రూ.5.50 లక్షలు ముందుగా డిపాజిట్ చేస్తే ఆరు నెలల్లో తిరిగి ఇస్తామని ప్రకటనలు గుప్పించారు. నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయాలు డిపాజిట్ చేయించుకున్నారు సదరు కంపెనీ ప్రతినిధులు. 700 మంది నుంచి రూ.30 కోట్ల మేర డిపాజిట్లు కట్టించుకుని కంపెనీ ప్రతినిధులు బోర్డు తిప్పేశారు. డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీ అమిత్ శర్మ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అమిత్ శర్మ కోసం గాలింపు చర్యలు చెపట్టారు.
మంచి జీతం, వర్క్ ప్రమ్ హోం అంటూ తమను నమ్మించి.. సెక్యూరిటీ కోసం లక్షల్లో డబ్బులు వసూలు చేసి, ఆర్నెళ్ల తరువాత బోర్డు తిప్పేసి తమను మోసం చేశారని బాధితులు ఆవేద వ్యక్తం చేస్తున్నారు. అమిత్ శర్మ అనే వ్యక్తి అందరిని నమ్మించి ఈ మోసానికి పాల్పడ్డాడని బాధితులు ఆరోపిస్తున్నారు. అమిత్ శర్మ అనే వ్యక్తి పంజాబ్ లోని జలంధర్ కి చెందిన వ్యక్తి అని బాధితులు తెలిపారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.