క్యాట్ ఫిష్ అనేది అమెరికాలోని అమెజాన్ నదిలో లభించే అత్యంత ప్రమాదకరమన చేపల్లోని ఓ రకం. ఈ క్యాట్ ఫిష్ మిగత చేపలను తిని తాను జీవనం సాగిస్తుంది. అందుకే దీనిని దెయ్యం చేప అని పిలుస్తారు. అలాంటి ప్రమాదకరమైన ఈ దెయ్యం చేప.. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా బుద్దారం చెరువులో జాలరులకు దొరికింది. ఇది చెరువులో ఉండే మిగతా చేపల్ని తినీ తన సంతతిని పెంచుతుంది. ఈ దెయ్యం చేప వలన చేపల ఉత్పత్తిలో మత్స్యకారులకు తీవ్ర నష్టం కలుగుతుంది.
తాజాగా ఈ జాతి చేపల కారణంగా తెలంగాణలోని మత్స్య సంపద తగ్గిపోయి.. మత్స్యకారుల జీవనోపాధి ప్రమాదం పడే పరిస్థితి ఉందని నిపుణులు అంటున్నారు. చేపల్ని తినేసి.. రైతులకు నష్టం కలిగించే ఈ చేపలు మత్స్యకారుల వలల్ని కూడా నాశనం చేస్తాయని నిపుణులు తెలిపారు. క్యాట్ పిష్ జాతికి చెందిన ఈ చేపను తెలంగాణ ప్రాంతంలో గుర్తించడం ఇదే తొలిసారి. కేవలం అమెజాన్ నది ప్రాంతంలో మాత్రమే లభించే ఈ చేప ఇక్కడ కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీనిని దెయ్యపు చేప పేరుతో పాటు బల్లిచేప అని కూడా పిలుస్తారు.
దీన్ని ఆక్వేరియం లలో పెంచుతారు. ఈ రకం చేపను తాము ఎప్పడు చూడలేదని బుద్దారం జాలర్లు చెబుతున్నారు. వింత ఆకారంలో ఉన్న ఈ చేపను చూసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా చేపలు నీరు లేకపోతే కొంత సమయంలో వ్యవధిలోనే చనిపోతాయి. కానీ హానికరమైన ఈ రకం చేప నీరు లేకపోయినప్పటికీ 15 రోజులకు పైగా బతకగలదు. నీటిలోనే కాకుండా భూమిపైనా ప్రయాణిస్తుంది. ఆ స్వభావంతో తన జాతిని సమీపంలోని ఇతర చెరువులో కూడా పెంచుకోగలదని నిపుణులు చెబుతున్నారు.