మహబూబాబాద్ జిల్లా, గడ్డిగూడెం తండాలో దారుణం చోటుచేసుకుంది. ఒక కసాయి తండ్రి తన పిల్లలను బావిలో పడేసి హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. గడ్డిగూడెం తండాకు చెందిన రామ్ కుమార్, స్థానికంగా నివాసముండే శిరీషను పదేండ్ల క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు జాక్సన్(8), జానిబేస్టో(6). రామ్‌కుమార్ ప్రస్తుతం ముంబైలో సీఎస్‌ఎఫ్ జవాన్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితమే రామ్‌కుమార్ తన కుటుంభం సభ్యులతో కలిసి సొంతూరికి వచ్చాడు.
ఇది కూడా చదవండి : ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు.. ఈ ఒక్క కారణంతోనే చివరికి!
ఏడాది క్రితం రామ్‌కుమార్ భార్య బంగారాన్ని బ్యాంక్‌లో కొదువపెట్టి డబ్బుతీసుకున్నాడు. తాజాగా ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన రామ్‌కుమార్ భార్యపై చేయిచేసుకోవడమే కాకుండా, క్షణికావేశంలో ఇద్దరు పిల్లలను తీసుకొని వెళ్లి బావిలో పడేశాడు.
ఆ తర్వాత గ్రామంలోకి వెళ్లి తన పిల్లలను బావిలో పడేసినట్లు తెలిపాడు. దీంతో గ్రామస్తులు వెంటనే బావి దగ్గరకు చేరుకుని, పిల్లలిద్దరిని బయటకు తీశారు. అప్పటికే పిల్లలిద్దరు మృత్యువాత పడ్డారు. అయితే జానీ బర్త్ డే కు ఒకరోజు ముందు తండ్రి ఈ దారుణానికి ఒడిగట్టాడు. చిన్నారుల మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు భోరున విలపించారు. ఈ సంఘటన జరిగిన తరువాత రామ్‌కుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.