క్షణిక సుఖం కోసం పరాయి స్త్రీతో లేదా పురుషుడితో అక్రమ సంబంధాన్ని నెరుపుతున్నారు. వారి మోజులో పడి కట్టుకున్న వారిని, కన్న తల్లిదండ్రులను, కడుపున పుట్టిన బిడ్డలను కూడా లెక్కచేయడం లేదు. ఈ సంబంధాల వల్ల రెండు కుటుంబాలు బాధితులవుతున్నాయి. వివాహేతర సంబంధాన్ని.. వివాహ సంబంధంగా మార్చుకునేందుకు..
వివాహేతర సంబంధాలు జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. దీని కారణంగా కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. క్షణిక సుఖం కోసం పరాయి స్త్రీతో లేదా పురుషుడితో అక్రమ సంబంధాన్ని నెరుపుతున్నారు. వారి మోజులో పడి కట్టుకున్న వారిని, కన్న తల్లిదండ్రులను, కడుపున పుట్టిన బిడ్డలను కూడా లెక్కచేయడం లేదు. వీరితో సహజీవనానికి అలవాటు పడి, అడ్డుగా ఉన్నారని భాగస్వామిని అంతమొందించిన ఘటనలు అనేకం చూశాం. అదే సమయంలో సహజీవనం చేస్తున్న వ్యక్తి కోసం ఆస్తి, పాస్తులు ధార పోస్తున్న వారి గురించి కథలు కథలుగా విన్నాం. ఈ సంబంధాల వల్ల రెండు కుటుంబాలు బాధితులవుతున్నాయి. వివాహేతర సంబంధాన్ని.. వివాహ సంబంధంగా మార్చుకునేందుకు తల్లిదండ్రులు అంగీకరించలేదని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. గార్లకు చెందిన బాణాల వెంకటేశ్.. తాపీ మేస్త్రీగా పనిచేస్తూ.. కుటుంబానికి చేదో్డు వాదోడుగా ఉంటున్నాడు. ఇతడికి వివాహం కాలేదు. అయితే గార్లలోని వేంకటేశ్వరస్వామి దేవాలయం బజార్‌కు ఓ వివాహితతో అతడికి పరిచయం ఏర్పడి.. అది అక్రమ సంబంధానికి దారి తీసింది. ఇటీవల ఆమె భర్త అనారోగ్యంతో చనిపోయాడు. ఆమెకు ముగ్గురు పిల్లలు. మహిళతో అక్రమ సంబంధంలో ఉన్న వెంకటేశ్.. ఆమెను వివాహం చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పాడు. కానీ తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో.. ఆవేశంతో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికొచ్చిన కొడుకు ఆసరాగా, అండగా నిలుస్తాడని ఆశించిన తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చాడు. కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మృతుడి తండ్రి శ్రీనివాసాచారి ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేశారు.