అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురుని, తాము వృద్ధాప్యానికి వచ్చేస్తే తమ బిడ్డకు ఓ తోడు ఉండాలన్నఉద్దేశంతో ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తారు తల్లిదండ్రులు. వెళ్లిన చోట తన కుమార్తెకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదని కట్నంతో పాటు పెట్టిపోతల కింద ఇంటెడు సామాను పంపిస్తారు. ఇవి చాలవన్నట్లు..
‘కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా.. విరిసి విరియని ఓ చిరునవ్వా.. కన్నుల ఆశలు నీరై కారగ, కట్నపు జ్వాలలో సమిధై పోయావా’అని ఓ కవి పేర్కొన్నది అక్షర సత్యం. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురుని, తాము వృద్ధాప్యానికి వచ్చేస్తే తమ బిడ్డకు ఓ తోడు ఉండాలన్నఉద్దేశంతో ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తారు తల్లిదండ్రులు. వెళ్లిన చోట తన కుమార్తెకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదని కట్నంతో పాటు పెట్టిపోతల కింద ఇంటెడు సామాను పంపిస్తారు. ఇవి చాలవన్నట్లు పెళ్లి సమయంలో వరుడు అడిగే గొంతెమ్మ కోరికలు తీరుస్తారు. పెళ్లి అయిపోయాక కుమార్తె పురుడు పోసుకున్న ఖర్చులు భరిస్తారు. అయినప్పటికీ ఆత్మసంతృప్తి చెందని అల్లుడు.. అదనపు కట్నం కింద ఇంకా తీసుకురావాలంటూ కుమార్తెను వేధిస్తూనే ఉంటాడు. దీంతో ఎవ్వరికి చెప్పుకోలేక ఆమె బలవన్మరణానికి పాల్పడుతోంది.
అదనపు కట్న దాహానికి మరో ఆడది బలైంది. ఆమె చనిపోతే.. కుమార్తెను కూడా పట్టించుకోరన్న కారణంగా లేక లేక పుట్టిన బిడ్డను బలిగొంది ఆ తల్లి. ఈ ఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాం నగర్ బాకారంలో నివాసముంటున్నారు విద్యాసాగర్, వసంత కుమారి దంపతులు. వీరికి పెళ్లై పదేళ్లైంది. వీరికి చాన్నాళ్లు పిల్లలు జన్మించలేదు. వీరికి పది నెలల క్రితం ఓ పాప పుట్టింది. ఆమెకు విద్యాధరణి అని పేరు పెట్టుకున్నారు. విద్యాసాగర్ ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి నాటి నుండే మరింత కట్నం తీసుకు రావాలని ఆమెను వేధిస్తున్నాడు. ఈ విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి.
ఈనెల 12వ తేదీన తన తల్లిని సోదరి ఇంట్లో వదిలి వెళుతున్నానని చెప్పి.. వెళ్లిన విద్యాసాగర్..13న అర్ధరాత్రి తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటి లోపలి నుంచి గడియ పెట్టడంతో తలుపు తట్టాడు. ఎంత సేపటికీ తలుపులు తీయకపోవడంతో ఆందోళనకు గురైన విద్యాసాగర్ చుట్టుపక్కల వారిని పిలిచాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. వారు వచ్చి తలుపులు తెరిచి చూడగా భార్య విజయ వసంతకుమారి, కూతురు విద్యా ధరణి విగత జీవులుగా పడి ఉన్నారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వసంత కుమారి తండ్రి నూకరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం విద్యాసాగర్ ముషీరాబాద్ పోలీసుల అదుపులో ఉన్నాడు.