డ్రగ్స్‌తో పోల్చుకుంటే గంజాయి ఇటీవల విరివిరిగా, విచ్చలవిడిగా దొరికేస్తుంది. చిన్న చిన్న షాపుల్లో కూడా చాక్లెట్స్ రూపాల్లో గంజాయి అమ్ముతున్నారు. యువతే లక్ష్యంగా చిన్న చిన్న పొట్లాలుగా కట్టి కాలేజీలు, స్కూల్స్ వద్ద సరఫరా చేస్తున్నారు. పోలీసులు కూడా అంతు చిక్కుకుండా గంజాయి అక్రమ రవాణా జరిపోతుంది.
నేటి యువత మాదక ద్రవ్యాలకు విపరీతంగా అలవాటుపడుతున్నారు. డ్రగ్స్, గంజాయి మత్తులో జోగుతున్నారు. అయితే డ్రగ్స్‌తో పోల్చుకుంటే గంజాయి ఇటీవల విరివిరిగా, విచ్చలవిడిగా దొరికేస్తుంది. చిన్న చిన్న షాపుల్లో కూడా చాక్లెట్స్ రూపాల్లో గంజాయి అమ్ముతున్నారు. యువతే లక్ష్యంగా చిన్న చిన్న పొట్లాలుగా కట్టి కాలేజీలు, స్కూల్స్ వద్ద సరఫరా చేస్తున్నారు. పోలీసులు కూడా అంతు చిక్కుకుండా గంజాయి అక్రమ రవాణా జరిగిపోతుంది. గుట్టు చప్పుడు కాకుండా చేతులు మారుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో వీటిని భారీగా పండిస్తూ.. నగరాలకు సరఫరా చేస్తున్నారు. వీటిపై ఫోకస్ పెంచారు తెలంగాణ పో్లీసులు. మొన్నటికి మొన్న నడి రోడ్డుపై గంజాయి మొక్కలను గుర్తించి.. వాటిని పీకేశారు. ఎంత అడ్డుకునే చర్యలు చేస్తున్నప్పటికీ..స్మగ్లర్లలు కొత్తదారులు వెతుకుతున్నారు. ఏకంగా ఓ ఇంట్లో గంజాయి మొక్కలను పెంచడాన్ని చూసి అవాక్కయ్యారు పోలీసులు
ఏజెన్సీ పండించి, నగరానికి తీసుకురావడం పెద్ద ప్రాసెస్, అందులోనూ పోలీసులకు తెలిసిపోతే పెద్ద తలనొప్పి అనుకుందేమో.. ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచేసిందో మహిళ. తెలంగాణలోని సత్తుపల్లి మండలం చంద్రాయ పాలెం గ్రామంలోని యట్టగాని సుధ అనే మహిళ ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలను గుర్తించారు ఎక్సైజ్ అధికారులు. పూల మొక్కల చాటున ఆ మహిళ గంజాయి మొక్కలను పెంచతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. భారీగా పెరిగిన 4 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. అయితే తనకేమీ తెలియదని, తాను పూల మొక్కలు వేస్తే ఇవి వచ్చినట్లు కల్లబొల్లి కబుర్లు చెప్పింది. ఆమె చెప్పేవన్నీ కట్టుకథలని గ్రహించిన.. పో్లీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గంజాయి మొక్కలు పెంచినా , సాగు చేసినా, ఇంట్లో ఉంచుకున్న నేరమే అంటున్నారు పోలీసులు.