చిన్న చిన్న విషయాలకు నేటి యువత తీవ్రంగా స్పందిస్తున్నారు. క్షణికావేశంలో తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు జీవితం కోల్పోయేలా చేస్తున్నాయి. తాజాగా ఓ డిగ్రీ విద్యార్థి అకారణంగా ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
నేటి కాలంలో యువత ఆలోచనా ధోరణి పూర్తి భిన్నంగా ఉంటుంది. కొన్ని సార్లు వారి చర్యలు సంభ్రమాశ్చర్యానికి గురి చేస్తుంటే..మరికొన్ని సార్లు బాధను కలిగిస్తుంటాయి. చిన్న విషయాలకే డిప్రెషన్‌కు లోనై భవిష్యత్తుపై ఆశలను వదులకుంటున్నారు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి తప్పుదోవ పట్టించడమే కాదూ.. జీవితాలను నాశనం చేస్తున్నాయి. బాగా చదువుకుని, మంచి ఉద్యోగంలో స్థిరపడి.. తల్లిదండ్రులకు ఆసరాగా నిలబడాల్సిన యువత, బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తెలంగాణలోని నిర్మల్ జిల్లాకు చెందిన ఓ యువతి క్షణికంలో తీసుకున్న నిర్ణయం ఆ ఇంట్లో విషాదాన్ని నింపింది.
లోకేశ్వరం ఎస్సై సాయి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పుస్పూర్ గ్రామానికి చెందిన దీపిక అనే యువతి భైంసా పట్టణంలోని ఓ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె తాత పెద్ద ముత్తన్న వీఆర్‌ఏగా పనిచేస్తున్నారు. ఈ నెల 20న ముత్తన్న గుండె పోటుతో మరణించాడు. తనకు ఎంతో ఇష్టమైన తాత మరణాన్ని జీర్ణించుకోలేక పోయింది దీపిక. మనస్థాపం చెందిన ఆమె తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఈ ఆదివారం కాలకృత్యాలకు అని బయటకు వెళ్లిన యువతి ఎంత సేపటికి ఇంటికి తిరిగి రాలేదు. దీపిక రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆమెను వెతకడం ప్రారంభించారు.
గ్రామ శివారులో ఉన్న బోప్పాజీ చెరువు వద్ద ఆమె చెప్పులు కనిపించాయి. చెరువులో వెతకగా.. ఆమె మృతదేహం లభించింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. ప్రాథమిక విచారణలో తాత మృతితో జీవితంపై విరక్తి చెందిన దీపిక.. చనిపోవాలని భావించి, చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. తండ్రి చిన్న ముత్తన్న ఫిర్యాదుతో మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఎంతో భవితవ్యాన్ని చూడాల్సిన యువత.. అకారణాలతో తనువు చాలించి.. కుటుంబాల్లో రోదన మిగులుస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.