ఆమె కాపురంలో సెల్ ఫోన్ కాక రేపింది. తరచూ ఫోనుతోనే గడపడటం, గంటలు గంటలు మాట్లాడుతుంటడంతో భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంపై తరచూ గొడవలు కూడా జరుగుతున్నాయి. దీంతో పుట్టింటికి వెళ్లిపోయిన మహిళ.. తిరిగి వచ్చింది. అయితే...
అనుమానాలు, అపార్థాలు పండంటి కాపురంలో చిచ్చు పెట్టాయి. భర్త, ముచ్చటైన ఇద్దరు పిల్లలతో సజావుగా సాగిపోతున్న ఆమె సంసారంలో సెల్ ఫోన్ రాక్షసిలా దాపురించింది. ఆమెపై భర్త అనుమానం పెంచుకున్నాడు. భార్య తరచూ ఫోనుతోనే గడపడటం, గంటల పాటు మాట్లాడుతుండటం మరింత అనుమానాలకు తావునిచ్చినట్లయింది.. ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కానీ ఈ తగాదాలే తన ప్రాణాలు తీస్తుందని ఊహించలేదు ఆ వివాహిత. పెద్దలు, భర్త, తల్లిదండ్రుల మాటలు విని .. భర్తతో తిరిగి కలిసేందుకు అంగీకరించిన మహిళ.. వచ్చిన కొన్ని గంటల్లోనే ఇంట్లో శవమై కనిపించింది.
వివరాల్లోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన మూడెత్తుల రమేష్‌తో పెద్ద పల్లి జిల్లా మంథని మండలం వెక్లాస్‌పూర్‌కు చెందిన ఎర్రయ్య తన కూతురు లక్ష్మి(30)కి 2008లో వివాహం జరిగింది. వీరికి కొడుకు, కుమారుడు ఉన్నారు. దాంపత్యం సజావుగా సాగిపోతున్న సమయంలో సెల్ ఫోన్ కాపురంలో చిచ్చు పెట్టింది. తరచూ ఆమె ఫోనులో ఎవ్వరితోనే మాట్లాడుతుండటంతో భర్తకు అనుమానం మొదలైంది. ఈ విషయంపై వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ వేధింపులు తాళలేక లక్ష్మి తన పుట్టింటికి వెళ్లిపోయింది.
అయితే ఈ విషయంపై రెండు రోజుల క్రితం పెద్దమనుషుల మధ్య పంచాయితీ జరిగింది. భార్యా భర్తల మధ్య రాజీ కుదిర్చారు. తిరిగి అత్తగారింటికి మంగళవారం ఆమె చేరుకుంది. అదే రోజు సుదర్శన్ అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడని లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుధవారం తెల్లవారి చూసేసరికి ఇంట్లో శవమై కనిపించింది. విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు పుట్ట కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె గొంతు నులిమి చంపేసినట్లు చెబుతున్నారు. శవపరీక్ష కోసం మృతదేహాన్ని మహదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన చెల్లి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, భర్త రమేష్, ఆడబిడ్డ వేధించారని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తునామని సీఐ రంజిత్, ఏఎస్సై కుమారస్వామి తెలిపారు.