దారుణం.. రెండేళ్ల చిన్నారి ప్రాణం తీసిన కారు

నడి రోడ్డుపై వాహనాలు నిలుపుతూ.. ట్రాఫిక్ జామ్‌కు కారకులవుతున్నారు వాహన దారులు. ఎక్కడ పడితే అక్కడే వాహనాలు నిలిపి వేసి ముచ్చట్లు పెడుతుంటారు కొందరు. ఇక కారు నడిపే వాళ్ల సంగతి చెప్పనక్కర్లేదు. నో పార్కింగ్ ఏరియాలో వాహనాలు నిలుపుతుంటారు. కారు డోరు తెరిచే సయమంలో కూడా వెనుక నుండి ఎవరైనా వస్తున్నారా అని చూడకుండా కారు తలుపులు తీసేస్తుంటారు.

రోడ్లు ఇరుకుగా, గతుకులు గతుకులుగా ఉంటేనే బయ్య్ మంటూ బైకులు దూసుకెళుతుంటాయి. ఇక చిన్న సందులు అని కూడా చూడరు కొంత మంది వాహన దారులు. చేతిలో బైక్, కారు ఉందని నివాసాల్లో నుండి వాహనాలను తీసుకెళుతుంటారు. జన సంచారం లేని ప్రాంతాల్లో్ అయితే వారి దూకుడుకు సరిపోతుంది. కానీ పాఠశాలలు, నివాస ప్రాంతాల్లో కూడా రయ్ మంటూ దూసుకెళుతుంటారు. నడి రోడ్డుపై వాహనాలు నిలుపుతూ.. ట్రాఫిక్ జామ్‌కు కారకులవుతారు. ఎక్కడ పడితే అక్కడే వాహనాలు నిలిపి వేసి ముచ్చట్లు పెడుతుంటారు కొందరు. ఇక కారు నడిపే వాళ్ల సంగతి చెప్పనక్కర్లేదు. నో పార్కింగ్ ఏరియాలో వాహనాలు నిలుపుతుంటారు. కారు డోరు తెరిచే సయమంలో కూడా వెనుక నుండి ఎవరైనా వస్తున్నారా అని చూడకుండా కారు తలుపులు తీసేస్తుంటారు. దీని కారణంగా అనేక ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. అలా చేయడం వల్ల ఓ నిండు ప్రాణం బలైంది.

హైదరాబాద్ మహా నగరంలోని ఎల్బీనగర్ ప్రాంతంలో విషాదం నెలకొంది. ఓ వ్యక్తి నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. ఇందులో రెండేళ్ల పాప మృతి చెందగా.. ఆమె తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. వివరాల్లోకి వెళితే.. మన్సురాబాద్ నుండి ఎల్బీనగర్ మార్గంలో ఓ కారును రోడ్డుపై ఆపాడో వ్యక్తి. అందులో నుండి ఓ వ్యక్తి వెళ్లిపోయాడు. అయితే డ్రైవర్ సీటులో ఉన్న వ్యక్తి కారు డోరు ఠక్కున తెరిచాడు. ఆ సమయంలో పక్క నుండి వెళ్తున్న బైక్.. కారు డోరుకు తగిలింది. ఆ బైకు మీద వెళుతున్న ముగ్గురు కింద పడిపోయారు. వీరిలో రెండేళ్ల చిన్నారి అక్కడిక్కడే మృతి చెంది. తల్లికి తీవ్ర రక్తస్రావమైంది. తండ్రి తృటిలో తప్పించుకున్నాడు. దీంతో భయపడ్డ డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యారు. ఆ పాపను ధనలక్ష్మిగా గుర్తించారు. తీవ్రంగా గాయమైన చిన్నారి తల్లి శశిరేఖ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు..కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed