తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఇటీవల కాలంలో నడి రోడ్డుపై దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. జనం చూస్తుండగానే, ఏ మాత్రం భయం లేకుండా ప్రాణాలు తీస్తున్నారు కొందరు. తాజాగా మరోసారి హైదరాబాద్ నగరం ఉలిక్కిపడే ఘటన చోటుచేసుకుంది.
ఇటీవల కాలంలో నడిరోడ్డుపై దారుణాలు పెరిగిపోతున్నాయి. పగబట్టిన వ్యక్తిపై కాపు కాసి, వెంటాడి, వేటాడి చంపేస్తున్నారు కొందరు. ప్రజలు సైతం.. ప్రాణ భయంతో చూస్తు ఉండిపోతున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ జనవరిలో జియాగూడ రోడ్డుపైన.. అందరూ చూస్తుండగానే.. ఒక వ్యక్తిని ముగ్గురు దుండగులు, కత్తులు, కొడవళ్లతో విచక్షణారహింతా నరికి చంపారు. ఏప్రిల్ లో చందానగర్ లో భార్యను రాయితో కొట్టగా.. ప్రాణ భయంతో పారిపోతుంటే.. వెంటాడి కత్తితో నరికాడో భర్త. తాజాగా మరోసారి హైదరాబాద్ నగరం ఉలిక్కిపడే ఘటన చోటుచేసుకుంది.
తెలంగాణ హైకోర్టు సమీపంలో దారుణ హత్య జరిగింది. రూ. 10 వేల అప్పు విషయంలో ఇద్దరి మధ్య గొడవకు జరిగి.. హత్యకు దారి తీసింది. ఈ ఘటన హైకోర్టు గేట్ నంబర్ 6 వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే.. మిథున్ అనే వ్యక్తి సులబ్ కాంప్లెక్స్ లో పని చేస్తున్నాడు. అయితే ఎవరైనా బాధల్లో ఉన్నాము అంటే డబ్బు సాయం చేసేవాడు. హై కోర్టు సమీపంలో పండ్లు అమ్ముకునే అజాం అనే వ్యక్తి మిథున్ వద్ద రూ. 10 వేలు అప్పుతీసుకున్నాడు. డబ్బులు ఇచ్చిన తిరిగి ఇవ్వకపోవడంతో.. మిధున్ అడగటంతో వీరిద్దరి మధ్య పలుమార్లు గొడవ జరిగింది. దీంతో మిథున్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నాడు అజాం. తన బావ మరిదికి విషయం చెప్పి .. హత్యకు స్కెచ్ వేశారు.
రోజులాగే అజాం వద్దకు మిథున్ వచ్చి డబ్బులు అడిగాడు. డబ్బుల ఇవ్వాలని కోరగా అజాం, తన బావమరిది , మిథున్‌తో గొడవకు దిగారు. జనం చూస్తుండగానే మిథున్‌ను కత్తులతో పొడిచి ఇద్దరూ అక్కడి నుండి రిపోయారు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయారు. ఘటనా స్థలికి చేరుకున్న చార్మినార్ పోలీసులు క్లూస్ టీం కేసు నమోదు చేసి ఆధారాలు సేకరిస్తున్నారు. మిథున్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.