ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్ అభిమానులకు ఎంత సంబురమో.. పోలీసులకు అంతకుమించిన పని. అందరూ ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే.. పోలీసులు మాత్రం బెట్టింగ్ రాయుళ్ల పని పట్టడంలో బిజీబిజీగా ఉంటారు. ఇప్పుడు అదే సాగుతోంది. నగర శివారులో బెట్టింగ్ స్థావరాలపై పోలీసులు దాడిచేయగా.. ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
దేశంలో ఐపీఎల్ సందడి ఏ రేంజులో ఉందో అందరికీ విదితమే. మ్యాచులు ఆఖరి బంతి వరకు సాగుతూ.. అభిమానులకు అసలు మజాను పంచుతున్నాయి. సాయంత్రం 6 దాటితే చాలు.. ఏ ఇంట్లో చూసినా.. ఐపీఎల్.. ఐపీఎల్ అనే వినిపిస్తుంది. ఇదిలావుంటే నగరంలో ‘కాయ్ రాజా.. కాయ్..’ అంటూ ఐపీఎల్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. తాజాగా హైదరాబాద్ శివారు ప్రాంతంలో బెట్టింగ్ నిర్వహిస్తోన్న ఓ ముఠా పోలీసులకు పట్టుబడింది. 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద రూ.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
ఐపీఎల్ నేపథ్యంలో పందెం రాయుళ్ళపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు. సమాచారం అందిన వెంటనే ఎప్పటికప్పుడు వారిపై దాడి చేసి వారి ఆటలు కట్టిస్తున్నారు. తాజాగా, హైదరాబాద్ నగర శివారు పేట్ బషీరాబాద్ పరిధిలో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు బెట్టింగ్ స్థావరాలపై దాడులు చేశారు. ఈ ఘటనలో 12 మందిని అరెస్టు చేయగా, మరో ఐదుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారు. పోలీసుల కదలికలను ముందుగానే పసిగట్టిన కొందరు బెట్టింగ్ రాయుళ్లు అక్కడినుండి పరుగందుకున్నట్లు సమాచారం. గోడలు దూకి తప్పించుకున్నారని వినికిడి. ఈ ముఠా నుంచి రూ. 50 లక్షల నగదు, 20 స్మార్ట్ ఫోన్లు, 8 ల్యాప్‌టాప్స్, 43 కీ ప్యాడ్ ఫోన్స్, నాలుగు టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Don’t be a part of the cricket betting.
Reach out for help, support, and reporting on #dial100.#SayNoToCricketBettings #CyberabadPolice pic.twitter.com/pCUMHdE2H1
— Cyberabad Police (@cyberabadpolice) April 18, 2023