ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ నడుస్తోంది. క్రికెట్ ప్రియులందరూ మ్యాచ్ ను చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మరొకవైపు బెట్టింగ్ ముఠాలు తమ దందాను కొనసాగిస్తున్నాయి. ఇలాంటి వారిపై నిఘా పెట్టిన పోలీసులు తరచూ అరెస్ట్ లు చేస్తుంటారు. తాజాగా నల్గొండ జిల్లాలో కూడా ఓ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ నడుస్తోంది. క్రికెట్ ప్రియులందరూ మ్యాచ్ ను చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మరొకవైపు బెట్టింగ్ ముఠాలు తమ దందాను కొనసాగిస్తున్నాయి. ఐపీఎల్ క్రికెట్ లేదా ఏ ఇతర ఆటలైనా సరే బెట్టింగ్ లకు పాల్పడుతుంటారు. ఇలా బెట్టింగ్ లకు పాల్పడుతున్న వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అయినా వారి బెట్టింగ్ లు మాత్రం ఆగడం లేదు. తాజాగా మిర్యాలగూడ కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇక జిల్లా ఎస్పీ అపూర్వరావు తెలిపిన వివరాల ప్రకారం..
నల్గొండ జిల్లా మిర్యాలగూడ హౌజింగ్ బోర్డు కాలనీలో సాయిదత్త అపార్టుమెంట్ లో బండు రాజేష్ కుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ముూడేళ్లుగా టెలిగ్రామ్ యాప్ లో హార్దిక్ బుకీ ప్యానల్ ద్వారా ఖమ్మం జిల్లాలో ఉండే తన బావమరిది కోలా సాయికుమార్ తో కలిసి ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా బెట్టింగ్ లకు పాల్పడుతున్నాడు. ముఖ్యంగా టెలిగ్రామ్ యాప్ ద్వారా హార్దిక్ బుకీ ప్యానల్ లింకుతో క్రికెట్ బెట్టింగ్‌లకు వీరు పాల్పడుతున్నారు. బుధవారం తన ఇంట్లో ఖమ్మం జిల్లాకు చెందిన రాజబంతి జీవన్‌కుమార్, కొండవేటి రాజేష్, శాఖమూరి ఉదయ్‌కుమార్, ఏపీకి చెందిన నోట్ల సత్యనారాయణ, మిర్యాలగూడకు చెందిన బంటు సంతోష్, నవీన్‌కుమార్, బంటు వంశీకృష్ణ, ఆన్‌లైన్‌లో ఐపీఎల్ బెట్టింగ్ పాల్పడుతున్నారు.
విశ్వసనీయ సమాచారంతో పోలీసులు వారిపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులను విచారించగా అసలు నిజాలు బయటకు వచ్చాయి. నిందితులు తప్పును ఒప్పుకోవడంతో రిమాండ్‌కు తరలించినట్ల ఎస్పీ పేర్కొన్నారు. బెట్టింగ్ ముఠా నుంచి రూ.1.12 కోట్ల నగదుతో పాటు రెండు కార్లు, 14 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముఠాలో ఒకరైన రాజేష్‌కుమార్ పై గతంలో హైదరాబాద్ సరూర్‌నగర్ పరిధిలో కేసు నమోదైంది. మీడియా సమావేశంలో ఎస్పీతో పాటు మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి, వన్‌టౌన్ సీఐ రాఘవేందర్, తదితర పోలీసులు పాల్గొన్నారు. మరి.. ఇలాంటి బెట్టింగ్ ల నివారణకు మీ సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.