వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థి ప్రీతి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రీతి పోస్ట్ మార్టం రిపోర్ట్ ను సీపీ రంగనాథ్ వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థి ప్రీతి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ కు తాజాగా బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రీతి పోస్ట్ మార్టం రిపోర్ట్ కు సంబంధించిన విషయాలను మీడియాకు వెల్లడించారు సీపీ రంగనాథ్. ముందు నుంచి ప్రీతి తల్లి దండ్రులు సైఫ్ వేధింపుల వల్లే మా కుతురు చనిపోయిందని ఆరోపిస్తూ వస్తున్నారు. తాజాగా పోస్ట్ మార్టం రిపోర్ట్ కు సంబంధించిన విషయాలతో పాటుగా మరికొన్ని విషయాలను మీడియాకు వెల్లడించారు సీపీ రంగనాథ్.
మెడికల్ విద్యార్థి ప్రీతి మృతి కేసు ఎంత సంచలనం సృష్టించిందో మనందరికి తెలిసిందే. సైఫ్ వేధింపుల కారణంగానే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడింది అని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు పేర్కొన్నారు. తాజాగా ఆ విషయాన్ని దృవీకరించారు. ప్రీతి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు గురించి సీపీ రంగనాథ్ పలు విషయాలు మీడియాకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ..” పాయిజన్ ఇంజక్షన్ తీసుకోవడం వల్లే ప్రీతి చనిపోయింది. ప్రీతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. అయితే ఆమె వాడిన ఇంజెక్షన్ దొరికింది కానీ ఆ నిడిల్ దొరకలేదు. ఈ కేసులో 10 రోజుల్లో చార్జ్ షిట్ దాఖలు చేస్తాం. అలాగే సైఫ్ వల్లే ప్రీతి ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్దారించాం” అని సీపీ రంగనాథ్ పేర్కొన్నాడు. అయితే పోస్ట్ మార్టం నివేదిక వచ్చే ముందు రోజే సైఫ్ కు బెయిల్ రావడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రీతి తల్లిదండ్రులు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ప్రీతి ఆత్మహత్య చేసుకుంది అని నివేదిక వస్తే.. ఆమె తల్లిదండ్రలు మాత్రం ఆత్మహత్య చేసుకునేంత పిరికితనం మా కూతురుకు లేదని వారి చెప్పుకొస్తున్నారు.