భార్యాభర్తల బంధం పాలు, నీళ్లలాగా కలిసుండాలి. స్వభావాలు, గుణాలు వేరైనా కలిసినప్పుడు ఒకేలా సాగిపోవాలి. ఈ ధోరణి పూర్వం దంపతుల్లో కనిపించేది. భర్త తిట్టినా, కొట్టినా సాయంత్రానికి ప్లేట్ లో అన్నం వడ్డించి.. మర్యాదులు చేసే వారు ఆకాలం భార్యలు. మగ వాళ్లు కూడా అంతే భార్య ఎప్పుడైనా అలకపాన్పు ఎక్కినా.. బుజ్జగింపులు చేసి మాములు స్థితికి తీసుకొచ్చే వారు. అయితే కాలం మారుతోంది కాబట్టి మనుషుల స్వభావాల్లో మార్పు వచ్చింది. సర్ధుకుపోయే గుణం నేటితరం మనుషులకు లేదు. ఇంకా ఈ కాలం భార్యాభర్తల బంధాలు దారుణంగా తయారయ్యాయి. ఇద్దరు జాబ్ చేస్తుండటం, అడ్జెస్ట్ కాలేక పోవడం వంటివి కొన్ని కారణాలుగా కనిపిస్తున్నాయి. దంపతుల మధ్య మనస్పర్థలకు ఇగో అతి ప్రధాన కారణం. ఆ ఇగోతోనే ఓ భర్త భార్యను ‘పో’ అని అన్న ఒక మాటకు వారి దాంపత్య జీవితం విడిపోయేదాకా వచ్చింది.
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ పట్టణంలోని ఓ జంటకు 15 నెలల క్రింతం వివాహం జరిగింది. ఇద్దరూ సాప్ట్ వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తున్నారు. ఇంకేం హాయిగా జీవితం సాగిపోతోంది. ఆ జీవితం వారికి నచ్చలేదేమో.. ఇద్దరి మధ్య ఒక విషయంపై గొడవ జరిగింది. ఆ సందర్భంలో భర్త.. భార్యను ‘పో’ అన్నాడు. ఇంక అంతే నన్నే పో అంటావా అంటూ తను పుట్టింటికి వెళ్లిపోయింది. ఒక సంవత్సరం పాటు ఒకరినొకరు చూసుకోలేదు, పలకరించుకోలేదు. కొంతకాలానికి విడాకులు కావాలని పోలీసులను ఆశ్రయించారు. వారు విడిపోవటానికి అసలు కారణం ఎంటో చెప్పారు. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. ఇంత చిన్న విషయానికి విడాకులేంటని అక్కడున్న వారు సైతం ఆశ్చర్యపోయారు. చూశారా ఇగో ఉంటే అక్షరాలు కూడా భార్యభర్తలను విడదీస్తాయి. తప్పు వాటిది కాదు మనుషుల ప్రవర్తనలది. జీవితంలో అన్ని కష్టనష్టాలను ఎదుర్కొంటూ కలిసినడుద్దాం… అని ఆ భార్యభర్తలు అనుకుంటే పర్వాలేదు. లేకుంటే ఇంక అంతే.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేండి.