దేశంలో ఇటీవల కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. పలు రాష్ట్రాలు కఠినంగా లాక్ డౌన్ అమలు చేశారు. మొత్తానికి సెకండ్ వేవ్ తగ్గు ముఖం పట్టింది. దాంతో విద్యాసంస్థలు తెరిచారు. ఇప్పుడు దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో మళ్లీ ప్రజల్లో ఆందోళన మొదలైంది. రాష్ట్రంలో పలు విద్యాసంస్థల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.
తాజాగా కరీంనగర్ జిల్లా చల్మెడ మెడికల్ కళాశాలలో 39 మందికి విద్యార్థులకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యిందని కళాశాల యాజమాన్యం తెలిపింది. దీంతో అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం మిగతా విద్యార్థులకు కరోనా టెస్ట్ చేయించే పనిలో ఉన్నారు. కాలేజ్ కి సెలవులు ప్రకటించిన యాజమాన్యం.
కాగా, అటు సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం, ముత్తంగి గురుకులాల్లో ఇప్పటికే పదుల సంఖ్యల్లో కేసులు నమోదు అయినట్లు వార్తలు వచ్చాయి. ఒమిక్రాన్ వేరియంట్ డేంజర్ పొంచి ఉందని.. కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని.. మాస్క్ తప్పని సరి అని ప్రభుత్వం హెచ్చిరకలు జారీ చేసింది.