ఈ మద్య రైల్వే స్టేషన్ లో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రైల్వే ఫ్లాట్ ఫామ్ పై జారిపడిన సమయంలో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ అదే సమయంలో కొంత మంది పోలీసులు తమ ప్రాణాలకు తెగించి రైలు ప్రమాదం నుంచి ఎంతో మందిని రక్షించిన సంఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా వరంగల్ లో ఓ కానిస్టేబుల్ చేసిన పనికి అందరిచేత ప్రశంసలు లభిస్తున్నాయి. 20 మంది సభ్యుల బృందం కృష్ణా ఎక్స్ ప్రెస్ లో తిరుపతి నుంచి వరంగల్ వస్తోంది.
వరంగల్ జిల్లా భీమారం గ్రామానికి చెందిన పార్వతి (53) కృష్ణా ఎక్స్ ప్రెస్ లో తిరుపతి నుంచి వరంగల్ వస్తుండగా ట్రైన్ వరంగల్ లో ఆగిన సందర్భంలో దిగలేకపోయింది. ఫుట్ బోర్డుకు వేలాడుతున్న ఆమె, నడుస్తున్న రైలు నుంచి దూకింది. అది గమనించిన ఇది గమనించిన డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ చిన్నరామయ్య అత్యంత చాకచక్యంగా ఆమెను ఒడుపుగా పట్టుకుని ప్లాట్ ఫాం మీదకి లాగేశారు.
ఇది చదవండి: ఆ కుటుంబంపై పగపట్టిన పాము! ఒక్కరిని వదలకుండా!
ఆ సమయంలో కానిస్టేబుల్ తో పాటు మరో ప్రయాణీకుడు కింద పడినా.. ఆమెను మాత్రం సురక్షితంగా రక్షించగలిగారు. విధి నిర్వహణలో ఎంతో సాహసం, మానవత్వం చూపించిన చిన్నరామయ్యను ప్రయాణికులు, రైల్వే అధికారులు అభినందించారు. చిన్న రామయ్య జాతీయ అథ్లెట్. అతని సాహసానికి రైల్వే అధికారులు, ప్రయాణికులు అభినందనలు తెలిపారు.
@RPF_INDIA constable risks his life to save a woman passenger’s life at the #Warangal railway station . Constable Chinnaramaiah is a national level athlete. @RailMinIndia @KSriniReddy @TelanganaToday pic.twitter.com/0y8tErJdWA
— Laxmareddy @Lakshman (@Lakshman_journo) February 21, 2022