కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన పెద్ద మనసు చాటుకున్నారు. పేద విద్యార్థిని డాక్టర్ చదువుకు తానున్నానంటూ భరోసానిచ్చి ఆమెకు ధైర్యాన్ని నింపారు. వివరాల్లోకి వెళితే.. నల్లగొండకి చెందిన బి.పద్మశ్రీ నీట్ ఎగ్జామ్‌లో ప్రతిభ చాటింది. ఆల్ ఇండియన్ మెడికల్ ఎంట్రన్స్(నీట్) టెస్ట్ ఆమె ప్రతిభకి చిన్నబోయింది. సాధారణ కుటుంబంలో పుట్టినా అసాధారణ ప్రతిభతో ఏకంగా 407 ర్యాంకు తెచ్చుకుంది. అయితే పద్మశ్రీ తండ్రి పూలు అమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కూతురిని డాక్టర్ చదువుకు పంపడం ఆయనకు అలవికాని విషయం.
ఇది చదవండి: కేసీఆర్ తో విభేదాలపై చిన్న జీయర్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు
పద్మశ్రీ ప్రతిభకు పేదరికం అడ్డుకారాదని భావించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచిమనసుతో ముందుకొచ్చారు. నేరుగా నల్లగొండలో ఆమె తండ్రి పూలు విక్రయించే చోటుకి వెళ్లి వారిని కలుసుకున్నారు. వివరాలు అడిగి తెలుసుకుని రూ.75 వేల చెక్కును అందజేశారు. అంతేకాదు పద్మశ్రీ డాక్టర్ చదువుకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థుల చదువుకు పేదరికం ఎప్పుడూ అడ్డుకావొద్దని ఆయన అన్నారు.
గతంలో పైలెట్ కావాలనుకున్న ఓ ఆటోడ్రైవర్ కుమార్తె ఆశయానికి చేయూతనిచ్చి ఆమెను చదువుకు కావాల్సిన అన్ని ఏర్పాటుచేశారు. అలాగే కామారెడ్డిలో ధాన్యం కుప్పపై పడి మరణించిన పేద రైతు కుటుంబానికి కూడా ఆర్థిక సాయం చేశారు. ఇలా కష్టాల్లో ఉన్నవారికి నేనున్నా అంటూ భరోసా ఇస్తున్న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.