ఎమ్మెల్యే సీతక్క అంటే రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. నిత్యం ప్రజల్లో ఉంటూ, వారి సమస్యలను తెలుసుకునే అతి కొద్దిమంది రాజకీయ నేతల్లో సీతక్క ఒకరు. తాజాగా మేడారం జాతరకు వచ్చిన ఆమె.. శిక్షణ ఐపీయస్ అధికారులతో కలసి నృత్యం చేస్తూ సందడి చేశారు. సీతక్క..సీతక్క.. అనే ఓ చిన్నోడి పిలుపుకు ఎక్కడో ఉన్న ఆమె టక్కున వచ్చారు. అంతే కాక ఆ బుడతడికి సెల్ఫీ ఇచ్చి ఖుషీ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
తెలంగాణ ఫైర్ బ్రాండ్ ములుగు ఎమ్మెల్యే సీతక్కకు ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజల సమస్యల పరిష్కారం పట్ల ఆమె చూపే చొరవ అందరికి తెలిసిందే. కరోనా సమయంలో అన్నం కోసం అల్లాడుతున్న గిరిజనులకు స్వయంగా తానే వెళ్లి.. బియ్యం అందించిన సంగతి తెలిసిందే. అలానే సీతక్క అని ఎవరైన సమస్యతో తన ముందుకు వస్తే వెంటనే పరిష్కారం కోసం కృషి చేస్తారు. ఇలా పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి మనస్సుల్లో స్థానం సంపాదించింది సీతక్క. తాజాగా సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర వెళ్లిన ఆమె అక్కడి వారితో కలిసి వన దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సీతక్క..సీతక్క అని పిలిచిన బుడ్డోడి పిలుపుకు సీతక్క ఫిదా అయ్యారు. నీ ప్రేమ నచ్చింది చిన్నోడా అంటూ సెల్ఫీ ఇచ్చారు. అనంతరం అక్కడే ఉన్న పోలీసు అధికారులతో కలసి డోలు వాయిద్యాలకు నృత్యం చేశారు. ఎమ్మెల్యే సీతక్క ఆదివాసీలతో కలిసి డాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.