సాధారణంగా బిర్యానీని తినేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. అందులోనూ నాన్ వేజ్ బిర్యానీ అంటే ఇక చెప్పనక్కర్లేదు. కుటుంబంతో కలసి హోటళ్లకి వెళ్లి మరీ.. బిర్యానీని ఆరగిస్తుంటారు. అలా వేడి బిర్యానీ తింటుంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా బిర్యానీ ప్రియులు బాగానే ఉన్నారు. అయితే ఇలా ఎంతో ఇష్టం మీద రెస్టారెంట్ కి వెళ్లిన వారికి అప్పుడప్పుడు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. బిర్యానీలో రాళ్లు, పురుగులు, బొద్దింక, ఇనుపమేకు మొదలైనవి ప్రత్యక్షమవుతుంటాయి. అయితే కొందరు చూసి చూడనట్లు వదిలేస్తారు. కానీ కొందరు మాత్రం రెస్టారెంట్ యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేసి వినియోదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తుంటారు. దీంతో నిజానిజాలు తెలుసుకుని వినియోగదారుల ఫోరమ్ కూడా హోటళ్ల యజమాన్యులకు జరిమానా విధిస్తుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షం కావడంతో హోటల్ యజమానికి రూ.15 వేలు జరిమానా పడింది. వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణ జిల్లా వరంగల్ సిటీలోని తాళ్లపద్మావతి కాలేజి సమీపంలోని ఓ హోటల్ కి మిట్ట మధ్యాహ్నం సమయంలో ఓ వ్యకి వెళ్లాడు. ఆకలి బాగా దంచేస్తుండటంతో దమ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు. అయితే ఈ లోపు కాస్తా నీళ్లు తాగి సేదరుతుండగా ఆర్డర్ ఇచ్చిన బిర్యానీని సిబ్బంది తీసుకొచ్చారు. అయితే ఆకలి మీద ఉన్న సదరు వ్యక్తి టేబుల్ పై ఉన్న బిర్యానీని తినేందుకు సిద్దమయ్యాడు. అలా బిర్యానీని తింటుండగా.. అందులో బొద్దింక ప్రత్యక్షమైంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కస్టమర్.. హోటళ్ల యజమానికి ఫిర్యాదు చేశాడు. ఆయన సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మరింత ఆగ్రహం చెందిన ఆ వ్యక్తి.. ఫుడ్ సేఫ్టి ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. కస్టరమ్ ఫిర్యాదుతో ఆ హోటళ్లు చేరుకున్న అధికారులు బిర్యానీని పరిశీలించారు. అంతే కాక హాటల్ లో తయారు చేస్తున్న ఇతర ఆహార పదార్ధలను సైతం తనిఖీ చేశారు.
ఈ క్రమంలో సదరు హోటల్ లో తయారు చేస్తున్న ఆహారంలో నాణ్యత లేదని అధికారులు గుర్తించారు. నాసిరకం ఆహారాన్ని వినియోగదారులకు వడ్డిస్తున్నారని అధికారులు గుర్తించారు. దీంతో హోటల్ యజమాన్యానికి రూ.15 వేల జరిమానా విధించారు. ఆహారంలో మార్పు రాకపోతే.. హోటల్ ను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. త్వరలో మరిన్ని హోటళ్లను కూడా తనిఖీలు చేస్తామని, నిబంధనలు పాటించని వాటిపై చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు. కొన్ని హోటళ్లల్లో నాసిరకం భోజనం పెడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని, త్వరలోనే వాటిపై కూడా తనిఖీలు నిర్వహిస్తామని చెబుతున్నారు. మరి.. ఇలా ఆహార పదార్ధాల్లో కీటకాలు, ఇతర వస్తువులు రావడం వంటి వాటికి నివారణ చర్యలుగా మీ సూచనలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.