తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దింతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరం పూర్తిగా జలమయం అయ్యింది. ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురి అవుతున్నారు. హైదరాబాద్ లో కురుస్తున్న వర్షం కారణంగా పలు చోట్ల భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటమే కాదు.. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక ఆఫీసులకు వెళ్లేవారు, చిరు వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు ప్రత్యకంగా చెప్పనక్కరలేదు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. తాజాగా భారీ వర్షాతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెండు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించగా.. తాజాగా శనివారం వరకు సెలవు ఇవ్వాలని నిర్ణయించింది. విద్యాసంస్థలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో పలు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు కూడా సెలవులు ప్రకటించేలా చర్యలు తీసుకోవాలి కార్మిక శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని.. హెలికాప్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్దంగా ఉంచాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
నగరంలో ఐటీ ఉద్యోగులకు సైతం రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హూమ్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం, శనివారం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హూం ని అనుమతించాల్సిందిగా ఐటీ మరియు ఐటీఈఎస్ కంపెనీలను ఆదేశించారు సీఎం కేసీఆర్. నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అత్యవసర పరిస్థితి ఉంటేనే నగరవాసులకు బయటకు రావాలని జీహెచ్ఎంసీ కీలక హెచ్చరిక చేసింది. మరోవైపు క్షేత్రస్థాయిలో డీఆర్ఎఫ్ బృందాలను జీహెచ్ఎంసీ మోహరించింది. లోతట్టు ప్రాంతాల్లో డీఆర్ఎఫ్ టీమ్ లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు నాలా పనులు పూర్తికాని
ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో ఆగని వాన.. ఏ ఏరియాలో ఎంత వర్షపాతం అంటే?