తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ప్రభుత్వం ఐటీ రంగంపై ప్రత్యేక దృష్టిని సారిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో దేశంలోనే ప్రతిష్టాత్మకమైన స్టార్టప్ ఇంక్యుబేటర్ అయిన టీ హబ్ 2.0 తెలంగాణలో ప్రారంభానికి రంగం సిద్ధమైంది. నగరంలో రూపుదిద్దుకున్న రెండవ టీ హబ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన రూపు దిద్దుకున్న టి హబ్ 2 ప్రత్యకతలు ఏంటో చూద్దాం..
హైదరాబాద్ లో ఐటీ కారిడార్ లో టి హబ్ 2 ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ భవనం పూర్తిగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. ఇక ఈ భవనం నిర్మాణం ఐదు రోడ్ల కూడలిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ భవన నిర్మాణం మూడు ఎకరాల్లో రూ.276 కోట్లతో 3.5 లక్షల చదరపు అడుగుల్లో రూపుదిద్దుకుంటుంది. ఇది ప్రపంచంలోనే అది పెద్ద భవనంగా ఉండబోతుంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే.. ఎలాంటి సపోర్ట్ లేకుండా గాలిలోనే ఉండడం. ఇది ఇంజనీర్ల యొక్క నైపుణ్యం.. గొప్పతనం ఏంతో నిరూపిస్తుంది. దీన్ని స్పేష్ షిప్ నిర్మాణం స్ఫూర్తిగా రూపొందిస్తున్నారు. నగరంలో తలమానికంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రంగా దీన్ని రూపొందించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఐటీ రంగానికి పెద్ద పీట వేస్తూ.. స్టార్టప్ లకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇచ్చేందుకు టీ-హబ్, డేటా సెంటర్ లాంటి ఇంక్యూబేటర్లను నగరంలో ఏర్పాటు చేసింది. 2015లో మొదటి టి హబ్ ను ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో ప్రారంభించారు. నగరంలో టెక్నాలజీ, ఐటీ ఉద్యోగులకు మరింత ప్రోత్సాహం ఉపాది కల్పించేందుకు మరో పెద్ద టీ హబ్ అవసరం అని ప్రభుత్వం గుర్తించి ఈ ప్రతిష్టాత్మక నిర్మాణం చేపట్టింది. ఇందులో స్టార్ట్ ఆప్‌లతో పాటు వెంచర్ క్యాపిటలిస్టులకూ ఛాన్స్ ఉంది.టీ-హబ్ నుంచి 5 మార్గాల్లో వెళ్లేందుకు ఏర్పాటు చేశారు. ఈ టీ హబ్ భవనం రాత్రి పూట జిగేల్ అంటూ మెరిసిపోతున్న ఫోటోలను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ ఫోటోలు చూసి నటుడు విజయ్ దేవరకండ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తమదైన స్టైల్లో ట్వీట్ చేశారు.
#Hyderabad 🤍 has its great Vibe Already ..
A lovely reverberating warm City full of colours💥
And Now this #InnovateWithTHub #Telangana ❤️Great Vision Very Futuristic 💫 @KTRTRS Sir https://t.co/tYmsURC3dD
— thaman S (@MusicThaman) June 27, 2022
Great for the future!
Such a positive for young businesses and hopefully lots of jobs will be created 🙂
Love the progress the state makes every year! @THubHyd https://t.co/UmimCHzlq6
— Vijay Deverakonda (@TheDeverakonda) June 26, 2022
మన తెలంగాణ ❤
Night view of T-Hub #InnovateWithTHub #Telangana#KCRDandu #THub @KTRTRS pic.twitter.com/f4OOl2FtHP— Kalvakuntla Vidyasagar Rao (@Vidyasagarrao_K) June 27, 2022