తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) ఆవిర్భావి దినోత్సవాన్ని గులాబీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వస్తున్నారు. టీఆర్ఎస్ 21వ ఆవిర్భా దినోత్స వేడుకలు హైదరాబాద్ లోని HICC లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఘనంగా జరుగుతోంది. వేలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలతో ప్రాంగణం నిండిపోయింది. తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన కేసీఆర్ అనంతరం శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు మాట్లాడుతూ.. దేశ రాజకీయల గురించి కూడా వ్యాఖ్యనించారు. జాతిపిత మహాత్మగాంధీని దూషిస్తూ.. ఆయను చంపిన గాడ్సేను పూజిస్తున్నారు. దేశాన్ని ఎటూ తీసుకెళ్దామనుకుంటున్నారు అంటూ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు.
“జాతిపిత మహాత్మాగాంధీనే దూషించే దేశమా భారతదేశం? ఏ దేశమైనా ఇలా చేస్తుందా? ఇదేం పెడ ధోరణి? దేశ స్వాతంత్రం కోసం ఏళ్ల తరబడి జైళ్లో మగ్గి, వ్యక్తిగత జీవితం త్యాగం చేసి.. జాతిపితగా పేరు తెచ్చుకున్న వ్యక్తిని దుర్భాషలాడతున్నారు. ఆయన్ని చంపిన హంతకులను పూజిస్తున్నారు. ఇది సంస్కృతా? ఇదా భారతదేశం? ఏం ఆశించి ఈ విద్వేషం చేస్తున్నారు. ఈ దేశాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు? ఏ రకమైన మత పిచ్చి ఈ దేశంలో రేపుతున్నారు? పదిమందికి పదవుల కోసం విధ్వంసం చేయడం చాలా తేలిక.
అదే నిర్మాణం చేయాలంటే ఎన్నాళ్లు పడుతుంది? విదేశాల్లో 13 కోట్ల మంది భారతీయులు పనిచేస్తున్నారు. కులం, మతం పేరుతో వాళ్లందర్నీ గెటౌట్ అంటే వాళ్ల పరిస్థితి ఏమిటి? వాళ్లందరికీ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందా? భారత్ లో చాలా పిచ్చి పిచ్చిగా జరుగుతోందని కువైట్ లో చర్చ జరుగుతోంది.. దేశం ఇప్పుడు అన్ని రంగాల్లో నాశనమైనపోయింది. దేశం ఓ లక్ష్యంతో పురోగమించాలి. అంతేకానీ, కేవలం సంకుచిత రాజకీయం లక్ష్యం ఉండకూడదు” అని కేసీఆర్ వ్యాఖ్యనించారు. మరి.. ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.