దేశ వ్యాప్తంగా సంచలనంగా మారుతున్న డ్రగ్స్ వ్యవహారంపై తెలంగాణ పోలీసులు యువతపై ప్రత్యేక నిఘా పెట్టారు. మరీ ముఖ్యంగా యువకులను టార్గెట్ చేస్తూ వారిపై కాస్త ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పోలీస్ యంత్రాంగానికి సంచలన ఆదేశాలు జారీ చేశారు. వాట్సప్ గ్రూపుల ద్వారా యువత చెడు దారుల్లోకి వెళ్తూ గంజాయికి బానిసలుగా మారుతున్నారని దీనిపై కట్టుదిట్టమైన నిఘా పెట్టి డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా తయారు చేయాలని ఆదేశాలు పంపినట్లు సమాచారం.
అయితే సీఎం ఆదేశాలను అనుసరిస్తూ హైదరాబాద్ పోలీసులు కాస్త రూటు మర్చారు. రోడ్డుపై అనుమానంగా కనిపించిన ప్రతీ వాహనదారుడిని ఆపి అతని బైక్ చెక్ చేస్తున్నారు. దీంతో పాటు మరీ ముఖ్యంగా అతని మొబైల్ ఫోన్ లోని వాట్సప్ లో డ్రగ్స్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అతని మొబైల్ లో అనుమానంగా ఎలాంటి మెసెజ్ లు కనిపించిన వారిని అరెస్ట్ చేస్తున్నారు.