తెలంగాణలో రాజ్‌భవన్ వర్సెస్ ప్రగతి భవన్ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ సీఎంవో పంపిన ఫైలును గవర్నర్ పక్కన పెట్టడంతో ప్రారంభమైన విభేదాలు తర్వాత వివిధ అంశాల వల్ల పెరిగి పెద్దవయ్యాయని టీఆర్ఎస్ వర్గాలుచెబుతున్నాయి. ఇటీవలి కాలంలో పలు సందర్భాల్లో గవర్నర్‌కు ప్రోటోకాల్ కూడా లభించడం లేదు. దీనిపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అయినా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదు.
ఈ ఏడాది ఏకంగా గవర్నర్ ప్రసంగం లేకుండా.. బడ్జెట్ సమావేశాలు ప్రారంభించారు. ఇక తెలుగు సంవత్సారాది ఉగాది నాడు.. ఈ వివాదం మరింత ముదిరింది. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికి భయపడనరి.. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తాను అని తెలిపారు. ఇక తాజాగా రాజ్ భవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. దానికి తోడు వేడుకల సందర్భంగా తమిళి సై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీశాయి. ఆ వివారాలు..
ఇది కూడా చదవండి: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటనరాజభవన్లో శుక్రవారం నిర్వహించిన ముందుస్తు ఉగాది వేడుకల్లో గవర్నర్ తమిళి సై ప్రసంగించారు. శుభకృత్ నామ సంవత్సరం తెలుగు వారి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఈ ఏడాది ప్రజలకు శుభప్రదంగా, సంతోషమయంగా ఉండాలని కోరుకున్నారు. ప్రజల మేలు కోసమే రాజ్‌భవన్ ఉందని.. ప్రజల సమస్యల పరిష్కారానికి విజ్ఞప్తుల విభాగం ఏర్పాటు చేశామని తెలిపారు. దాని ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించానని తెలిపారు. మే నెల నుంచి ప్రజా దర్భార్ నడుస్తుందని తెలిపారు.
ఇది కూడా చదవండి: ఈటెలకు లేఖ రాసిన సీఎం కేసీఆర్.. ఎందుకోసమంటే!
ఇక గవర్నర్ హోదాలో తన పరిమితులు తనకు తెలుసని.. తననెవరూ నియంత్రించలేరని.. తాను చాలా శక్తివంతురాలనని, ఎవ్వరి ముందూ తలవంచేది లేదని తమిళి సై స్పష్టం చేశారు. తాను తెలంగాణ ప్రజలను ప్రేమిస్తానని, గౌరవిస్తానని తెలిపారు. ప్రజలు కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలని సూచించారు. అంతేకాక రాజ్ భవన్ ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించానని.. అయినా వారు రాలేదని తెలిపారు. వచ్చిన వారిని గౌరవిస్తానని.. రాని వారిని పట్టించుకోను అన్నారు. ప్రగతి భవన్ ఉగాది వేడుకలకు ఆహ్వానించి ఉంటే.. ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి మరి వెళ్లేదాన్నని తెలిపారు. అంతేకాక ‘‘నేను చాలా సార్లు ఆహ్వానించినా సీఎం, మంత్రులు రావడం లేదు. యాదాద్రికి నన్ను ఆహ్వానించలేదు. మేడారానికి ఆహ్వానించకున్నా వెళ్లాను. ప్రభుత్వపరంగా కొన్ని అంశాల్లో విభేదాలున్నాయి. ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేయడం నాకు నచ్చదు’’ అన్నారు. గవర్నర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ప్రజల్లో సిట్టింగులపై అసంతృప్తి.. మెజార్టీ ఎమ్మెల్యేలకు టిక్కెట్ లేనట్లేనా?..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.