ఇటీవల పలు రాష్ట్రా హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను, న్యాయమూర్తులను సుప్రీం కోర్టు నియమించింది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ఉదయం రాజ్ భవన్ లో హైకోర్టు సీజే ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఉజ్జల్ భూయాన్ చేత గవర్నర్ తమిళ సై ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర హైకోర్టు ఏర్పడిన తరువాత ప్రధాన న్యాయ మూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఐదో న్యాయమూర్తి భూయాన్. గతంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ పని చేశారు. ఆయన ఢిల్లీ హైకోర్టుకు బదిలీ కావటంతో, ఆయన స్థానంలో జస్టిస్ భూయాన్ ను ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికయ్యారు.
ఈ ప్రమాణ స్వీకారమహోత్సవానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. దాదాపు 9 నెలల తర్వాత సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు వచ్చారు. గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్ చాలా కాలం తరువాత ఒకరికొకరు ఎదురుపడ్డారు. సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి , కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి నిరంజన్ రెడ్డి, అధికారులు హాజరయ్యారు. మరోవైపు హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రాజ్‌భవన్‌లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాజ్‌భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. సీఎం కేసీఆర్ చాన్నాళ్ల తర్వాత రాజ్ భవన్ కు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కేంద్రంలోని బీజేపీని తీవ్రంగా విమర్శిస్తున్న కేసీఆర్ కు గవర్నర్ తమిళిసైతో కూడా పొసగడం లేదన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా తమిళిసై పాల్గొన్న పలు అధికారిక కార్యక్రమాలకు, రాజ్ భవన్ కు కేసీఆర్ దూరంగా ఉన్నారు. దాంతో, హైకోర్టు సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరవుతారో లేదో అన్నది చర్చనీయాంశమైంది. అయితే, ప్రోటోకాల్ ప్రకారం రాజ్ భవన్ కు వచ్చిన సీఎం కేసీఆర్… గవర్నర్ కు పుష్పగుచ్ఛం అందించారు. చాన్నాళ్ల తర్వాత గవర్నర్, సీఎం కేసీఆర్ ఎదురుపడ్డ ఇరువురూ నవ్వుతూ కనిపించారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Hon’ble Governor @DrTamilisaiGuv administered the oath of office to Hon’ble Justice Sri Ujjal Bhuyan as Chief Justice of High Court of Telangana at Raj Bhavan today. Hon’ble CM Sri K. Chandrashekar Rao was present at the swearing-in ceremony. pic.twitter.com/YR3lbuvri7
— Telangana CMO (@TelanganaCMO) June 28, 2022