తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో మంత్రులతో సమావేశమయ్యారు. మంత్రులందరూ ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కు చేరుకోవాలని ప్రగతి భవన్ నుంచి పిలుపు రావడంతోనే అందరూ పనులు అన్నీ పక్కన పెట్టేసి హుటాహుటిన ఫామ్ హౌస్ కు పయనమయ్యారు. ముగ్గురు మంత్రులు మినహా అందరూ సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది. అమెరికా పర్యటనకు వెళ్లిన కేటీఆర్, మహారాష్ట్ర పర్యటనలో ఉన్న మంత్రి నిరంజన్ రెడ్డి, ఖమ్మంలో ఉన్న పువ్వాడ అజయ్ మినహా అందరూ హాజరయ్యారు. సీఎస్ సోమేశ్ కుమార్ కూడా పాల్గొన్నారు. శాసన సభాపతి, ఎమ్మెల్సీ కవిత కూడా సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: త్వరలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభువుల దర్శనం..
అయితే ఇప్పుడు ఈ ఎమర్జెన్సీ మీటింగ్ దేనికి అనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. పాలనా పపమైన నిర్ణయాల గురించే ఈ మీటింగ్ అంటూ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో భారీ నోటిఫికేషన్ ప్రకటించినా కూడా ప్రజల్లో నమ్మకం కుదరడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయి? ఎంత సమయం పడుతుంది? వంటి కీలక విషయాలపై చర్చించవచ్చు. మరోవైపు జీవో 111 రద్దు గురించి కూడా చర్చించే అవకాశం ఉండచ్చు. నెలలోపే యాదాద్రి పునఃప్రారంభం ఉండటంతో.. ఆ విషయంపై కూడా చర్చగచ్చు అంటున్నారు.
అయితే అసలు పాలనా పరమైన నిర్ణయాలైతే ఫామ్ హౌస్ లో ఎందుకు చర్చిస్తున్నారు? సీఎం కేసీఆర్ అలాంటి సమావేశాలు ప్రగతి భవన్ లోనే నిర్వహిస్తారు కదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ముందస్తు ఎన్నికల గురించి ఏమైనా చర్చించేందుకు సమావేశమయ్యారా? అందుకే స్పీకర్ కూడా వచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు ప్రశాంత్ కిషోర్ ఏంట్రీ, సర్వే మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. అయితే అసలు ఆ మీటింగ్ ఎందుకు అనేది మాత్రం సమావేశం తర్వాత మంత్రులు అధికారికంగా మీడియాతో మాట్లాడితేనే ఒక స్పష్టత వస్తుంది. సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళ్తారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.