రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆమెకు ఓ లేఖ పంపారు. తెలంగాణ ప్రజల తరఫున గవర్నర్ తమిళిసై కు బర్త్ డే విషెస్ చెబుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ లెటర్ లో పేర్కొన్నారు. ఆమెకు ఎల్లప్పుడూ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. దేవుని ఆశీస్సులతో మరెన్నో ఏళ్లు ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ లేఖ రాజకీయంగా కూడా చర్చనీయాంశమవుతోంది.
రాజ్‌భవన్, ప్రగతిభవన్ల మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. ఈ ఏడాది మార్చిలో శాసనసభ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగంతో ప్రారంభించాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసై.. తెలంగాణకు గవర్నర్‌గా వచ్చినా తన పాత వాసనలను పోగొట్టుకోలేదని టీఆర్ఎస్ వ్యాఖ్యానించింది. మర్యాద ఇచ్చిపుచ్చుకోవడంలో గవర్నర్‌తో అసలు సమస్య ఉందని.. ఉన్నత మర్యాదలను ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వంతో కయ్యం పెట్టుకున్నారని పేర్కొంది.
గతంలో దిల్లీ పర్యటనలో.. గవర్నర్ తమిళిసై స్పందిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో విభేదాలు ఉన్న మాట వాస్తవమే అయినా.. ఆ పరిస్థితిని తాను కోరటం లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు.. అధికార పార్టీకి అనుకూల నిర్ణయాలు తీసుకోలేమని.. కొన్ని వ్యతిరేకించాల్సి ఉంటుందని చెప్పారు. రాజ్యాంగ పరిధికి లోబడి గవర్నర్ విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. ఈ విభేధాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం చర్చనీయాంశంగా మారింది. విభేదాలు సైతం పక్కకు పెట్టి కేసీఆర్ బర్త్‌డే విషెస్ తెలపడంతో.. కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు. ఇక.. ప్రతిపక్షాలు తమదారి తమదే అన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నాయి. రాజకీయంగా తమకు అనుకువుగా మారతారనే .. కేసీఆర్ ఇలా చేశారని విమర్శిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: KCR: రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం పెరుగుతోంది : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేసీఆర్
దేశంలో గవర్నర్‌లు, ముఖ్యమంత్రుల మధ్య వివాదాలు కొత్త కాదు. గతంలోనూ ఉన్నాయి. ప్రస్తుతమూ కొనసాగుతున్నాయి. తాజాగా ఆ జాబితాలో తెలంగాణ కూడా చేరడం విశేషం. మరి.. రాజ్‌భవన్, ప్రగతిభవన్ల మధ్య సఖ్యత నెలకొంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Thank you for your warm birthday wishes Shri. @PawanKalyan Ji https://t.co/Ny54aq6Dqd
— Office Of Dr.Tamilisai Soundararajan (@TamilisaiOffice) June 2, 2022
Birthday greetings to Hon’ble Governor of Telangana Smt Dr. Tamilisai Soundararajan Garu. @DrTamilisaiGuv
Wishing you good health, long life, and well-being in the service of our people.*File pic* pic.twitter.com/RuhwYGfWD7
— Vijayalaxmi Gadwal, GHMC MAYOR (@GadwalvijayaTRS) June 2, 2022