గత కొంత కాలంగా తెలంగాణ కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలె దర్శనం మొగులయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. సీఎం కేసీఆర్ దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల రివార్డను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా డోలు వాయిద్యంలో ప్రతిభ కనబరిచి భారత అత్యున్నత పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ అవార్డు అందుకున్న ఆదివాసీ కళాకారుడు సకిని రామచంద్రయ్యను ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా సత్కరించారు. పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన సందర్భంగా రామచంద్రయ్యను సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇది చదవండి : ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్ కూతురు ఐశ్వర్య
ఈ సందర్భంగా అంతరించిపోతున్న ఆదివాసీ సాంస్కృతిక కళను బతికిస్తున్నందుకు సకిని రామచంద్రయ్యను సీఎం కేసీఆర్ అభినందించారు. తన జీవితకాలపు ప్రతిభకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును పొందడం పట్ల కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రామచంద్రయ్య యోగ క్షేమాలను సిఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు సకిని రామచంద్రయ్యకు ఆయన సొంత జిల్లా కేంద్రం కొత్తగూడెంలో నివాసయోగ్యమైన ఇంటిస్థలంతో పాటు నిర్మాణ ఖర్చుకు రూ.1 కోటి రూపాయల రివార్డును ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇంటి స్థలం, నిర్మాణానికి సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్‌రావు, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, తలసాని, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పాల్గొన్నారు.
గుస్సాడీ కళాకారుడు కనకరాజుకి భారీ నజరానా :
ఇక మరో కళాకారుడు గుస్సాడీ నృత్యకళాకారుడు, పద్మశ్రీ పురస్కార విజేత కనకరాజుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదరణ చూపారు. కనకరాజుకు భారీ రివార్డు ప్రకటించారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన కనకరాజు ఆదివాసీల సంప్రదాయ గుస్సాడీ నృత్యంలో సుప్రసిద్ధుడు. ఆయన స్వస్థలం జైనూర్ మండలం మర్లవాయి గ్రామం.
గత 55 ఏళ్లుగా ఆయన గుస్సాడీ నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఈ నేపథ్యంలో గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుకు కూడా భారీ రివార్డు ప్రకటించారు ముఖ్యమంత్రి. సొంత జిల్లా కేంద్రంలో నివాసయోగ్యమైన ఇంటి స్థలం, ఖర్చుల కోసం కోటి రూపాయలను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు బాధ్యతలు అప్పగించారు.
పద్మశ్రీ కనక రాజుకు రివార్డు ప్రకటించిన సీఎం కేసీఆర్
గత సంవత్సరం పద్మశ్రీ అవార్డు అందుకున్న గుస్సాడీ నృత్య కళాకారుడు శ్రీ కనకరాజుకు తన స్థానిక జిల్లా కేంద్రంలో నివాసయోగ్యమైన ఇంటి స్థలాన్ని, నిర్మాణం ఖర్చులకోసం 1 కోటి రూపాయలను సీఎం శ్రీ కేసీఆర్ ప్రకటించారు. pic.twitter.com/DFKivkQQDH
— TRS Party (@trspartyonline) February 1, 2022