నేటి రాజకీయ నాయకుల్లో కొందరు ఒక్క సారి గెలిస్తే.. తిరిగి ఐదేళ్ల వరకు నియోజకవర్గ ప్రజల వైపు కన్నెత్తి కూడా చూడరు. ఇక తమ సమస్యలను సదరు నాయకుడికి చెప్పుకుందానికి వెళితే.. మెడలు పట్టి సెక్యూరిటీతో గెంటించిన సంఘటనలు కూడా మనం గతంలో చూశాం. అయితే అందరు నాయకులు ఒక్కలా ఉండరు అని కొంత మంది అరుదైన నాయకులు చేసే పనులను చూస్తే తెలుస్తుంది. తాజాగా ఓ పిల్లాడు నిండు సభలో MLA కి ధైర్యంగా తన సమస్యను చెప్పుకున్నాడు. అది విన్న సదరు ఎమ్మెల్యే ఆ పిల్లాడికి ఊరి ప్రజలందరి ముందు మాటిచ్చాడు. అయితే చాలా మంది నాయకులు ఇచ్చిన మాటలను మర్చిపోవడం రాజ్యంగం ఇచ్చిన ఓ హక్కులా భావిస్తారు. కానీ ఈ ఎమ్మెల్యే అలా కాదు ఇచ్చిన మాట గుర్తు పెట్టుకుని మరీ నిలబెట్టుకున్నాడు.
అది కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం. అక్కడి ఎమ్మెల్యే పేరు సుంకె రవిశంకర్. గతంలో గంగాదరం మండలం సర్వారెడ్డి పల్లెలో మీటింగ్ ను నిర్వహించారు. ఈ మీటింగ్ లో ఓ పిల్లాడు ధైర్యంగా తన సమస్యను ఎమ్మెల్యేకు వివరించాడు. మా వీధిలో సరైన రోడ్డు లేదని, వర్షాకాలం వస్తే.. తీవ్ర ఇబ్బంది కలుగుతుందని మీటింగ్ లో అందరి ముందు చెప్పాడు. దాంతో ఎమ్మెల్యే రవిశంకర్ పిల్లాడి ధైర్యాన్ని మెచ్చుకుని, అందరు ఇలా ప్రశ్నించే తత్వాన్ని అవర్చుకోవాలని సూచించాడు. అదీకాక త్వరలోనే రోడ్డు వేయిస్తానని మాటించాడు. ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు పనులకు తాజాగా శంకుస్థాపన కూడా చేశాడు. సమస్య చెప్పిన పిల్లాడితోనే రిబ్బన్ కట్ చేయించి శంకుస్థాపన చేయించారు ఎమ్మెల్యే రవిశంకర్.
దాంతో తమ వీధికి రోడ్డు తెప్పించిన పిల్లాడిని అందరు పొగుడుతున్నారు. ఇక పిల్లాడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే రవిశంకర్ ను శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. అయితే ఇది ఎమ్మెల్యే చేయాల్సిన పనే అంటున్నారు కొందరు నెటిజన్స్. అదీ నిజమే అయినప్పటికీ ఎంత మంది నాయకులు ఇలా ఇచ్చిన మాటను గుర్తుపెట్టుకుని నెరవేరుస్తారు అని మరికొందరు నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి పిల్లాడికిచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.