మేడారం సమ్మక్క సారలమ్మలపై చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై గిరిజనులు, రాజకీయ నేతలు ఆయనపై నిప్పులు చెరిగారు. గిరిజనులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై చిన్నజీయర్ స్వామి దీనిపై స్పందించారు.
గతంలో సమ్మక్క సారలమ్మల గురించి చిన్న జీయర్ చేసిన వ్యాఖ్యలు కొద్దిరోజులుగా వైరల్ అవుతున్నాయి. అందులో సమ్మక్క, సారలమ్మలు దేవతలు కారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు సమ్మక, సారలమ్మలు ఎవరు? వారేమూనా దేవతలా? బ్రహ్మ లోకం నుంచి దిగొచ్చారా? అని అన్నారు. ఈ వ్యాఖ్యలు కాస్తా వైరల్ అయ్యి.. దుమారం రేపిన సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారంపై చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ.. “మహిళలను నేనెప్పుడూ కించపర్చేలా మాట్లాడలేదు. కొందరు దేవతలను చిన్నచూపు చూసేటట్టు మాట్లాడానని అనడం పొరపాటు. పూర్వాపరాలు తెలియకుండా ఒక మాట విని నిర్ణయానికి రావడం హాస్యాస్పదం. గిరిజనులు మంత్రాలను అద్భుతంగా చదువుతారు. ఆదివాసీలు, హరిజనులు అనే తేడాలేకుండా.. ప్రగతిపథంలో నడిపించాలని మా గురువులు చెప్పారు” అని తెలిపారు. మరి..చినజీయర్ స్వామి ఇచ్చిన వివరణపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.