చికోటి ప్రవీణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల కొంతకాలం నుంచి ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు. మూడు రోజుల క్రితం థాయ్ లాండ్ లో చికోటీ అరెస్టైన విషయం తెలిసిందే. అనంతరం షరుతులతో కూడిన బెయిల్ పై ఆయన విడుదలయ్యారు. తాజాగా థాయ్ లాండ్ లో తన అరెస్ట్ కు గురించి చికోటి ప్రవీణ్ స్పందించారు.
చికోటి ప్రవీణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల కొంతకాలం నుంచి ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు. అలానే పాములను, ఇతర జీవాలను మెడలో వేసుకుంటూ సోషల్ మీడియాలో తెగ కనిపిస్తున్నారు. ఇకపోతే ఇటీవలే థాయ్‌లాండ్‌లోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో జూదం ఆడుతూ ప్రవీణ్ దొరికిపోయిన విషయం తెలిసిందే. అనంతరం బెయిల్ పై ఆయన విడుదలయ్యారు. అయితే ఈ అరెస్ట్ పై తాజాగా ప్రవీణ్ స్పందించాడు. తనని కావాలనే ఎవరో టార్గెట్ చేస్తున్నారని తన తప్పేమీ లేదని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లోకి వస్తున్న అనే వదంతుల వల్లే ఇలా టార్గెట్ చేస్తున్నారన్నారని ఆయన తెలిపారు.
కొన్ని రోజుల క్రితం జూదం ఆడుతూ.. చికోటి ప్రవీణ్ థాయ్ లాండ్ లో అరెస్టైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత షరుతలతో కూడిన బెయిల్ పై విడుదలయ్యారు. ఆయనతో పాటు 83 మందికి థాయ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. థాయ్ లాండ్ లోని ఓ హోటల్ లో పోకర్న్ నిర్వహిస్తుండగా చికోటి సహా 93 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత వీరందరికీ బెయిల్ లభించింది. వీరికి నగదు రూపంలో జరిమానా కట్టిన అనంతరం బెయిల్ వచ్చింది.
అయితే కేసు విచారణ పూర్తయ్యే వరకు అందరి పాస్ పోర్టు అధికారు వద్దనే ఉంచుకోవాలని కోర్టు ఆదేశించింది. అయితే చికోటి ప్రవీణ్ ఫైన్ చెల్లించడంతో స్థానిక కోర్టు పాస్ పోర్టులను తిరిగి ఇచ్చిందని సమాచారం. తాజాగా థాయ్ లాండ్ లో తన అరెస్ట్ పై చికోటి ప్రవీణ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. “కొన్ని దేశాల్లో పోకర్ టోర్నమెంట్ కి చట్టబద్ధమైన పర్మిషన్ ఉంది. అలానే ఉందని థాయ్ లాండ్ లో జరిగిన ఆ ఈవెంట్ కి కూడా ఒక ప్లేయర్ లాగా వెళ్లాను. ఈ క్రమంలో పోలీసులు దాడులు చేశారు. ఈ తనిఖీలో ఓ కమిషనర్ స్థాయి అధికారితో పాటు 100 పైగా పోలీసులు పాల్గొన్నారు.
నేను ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి రూ. 50 లక్షలు ఇచ్చాను అనేది అవాస్తవం. నేను ఈవెంట్ ఆర్గ్‌నైజ్ చేయలేదు. నేను హాల్ లోకి వెళ్లిన 15 నిమిషాలకే రైడ్ జరిగింది. ఈ ఈవెంట్ నాలుగు రోజులు లేదా మూడు రోజులని తెలియదు. ఆ టోర్మమెంట్ కోసం ఆహ్వానం వస్తేనే నేను వెళ్లాను. నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే నా పాస్ పోర్టును బ్లాక్ లిస్టులో చేర్చలేదు. నన్ను అణగదొక్కేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారు” అని చికోటి ప్రవీణ్ పేర్కొన్నారు. మరి.. ప్రవీణ్ వ్యాఖ్యలు నిజమని నమ్ముతున్నారా?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.