భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ను చికోటి ప్రవీణ్ కుమార్ కలిశారు. ఇటీవల హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రాజాసింగ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈక్రమంలో ఎమ్మెల్యేను కలిసేందుకు భారీగా కార్యకర్తలు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ ను కలిసిన చికోటి ప్రవీణ్…ఆయనకు తన మద్దతు ఉంటుందని తెలిపారు. రాజాసింగ్ ఇంటికి వెళ్లి.. ఆయన్ను పరామర్శించిన చికోటి ప్రవీణ్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులే భవిష్యత్తులోనూ కొనసాగితే.. హిందువులు మైనార్టీలుగా మారే ప్రమాదం ఉందని చికోటి వ్యాఖ్యానించారు.
కొన్ని నెలల క్రితం రాజాసింగ్ జైలు వెళ్లిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం హైకోర్టు ఆయనకు షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈక్రమంలో పరామర్శించేందుకు పలువురు నాయకులు ఎమ్మెల్యే ఇంటికి వెళ్తున్నారు. చర్లపల్లి జైలు నుండి విడుదలైన రాజాసింగ్ ను చికోటి ప్రవీణ్ కుమార్ కలిశారు. ఓ హిందూవాదిగా తాను రాజాసింగ్ ను కలిసినట్టుగా చీకోటి చెప్పారు. దాదాపు పదేళ్ల క్రితం తాను రాజాసింగ్ ను కలిసినట్టు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాజాసింగ్ కు నైతిక మద్దతు ఇచ్చేందుకు తాను ఇక్కడికి వచ్చినట్లుగా ఆయన తెలిపారు. తాను కోఠిలోని సంతోషిమాత ఆలయంలో పూజలు చేసిన తర్వాత.. అక్కడినుంచి రాజాసింగ్ ఇంటికి వెళ్లే ప్రయత్నం చేశానని.. దానికి పోలీసులు అభ్యంతరం చెప్పడం ఏంటని ప్రవీణ్ ప్రశ్నించారు.
ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ.. బలవంతంగా మతమార్పిడులకు పాల్పడే వారిపై ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలని, ఎవరైనా తమ ఇష్టంతో మతం మారితే తప్పులేదని ఆయన తెలిపారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నారు. ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే భాగ్యనగరంలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానన్నారు. తాను సిరిసిల్ల నుండి పోటీచేస్తానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. తన కథను రామ్ గోపాల్ వర్మ అడిగారన్నారు. ఒక వేళ ఆర్జీవీ అడిగితే సినిమాలో నటిస్తానని చెప్పారు.
Chikoti praveen met @TigerRajaSingh and extended his full support to him.🚩🚩🚩🚩 pic.twitter.com/LhVo6GXeA4
— chary @Name is chary 🚩🚩 (@CharydasD) November 11, 2022