కొంతకాలం క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన చికోటి ప్రవీణ్ ను థాయ్ లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడితో పాటు 91 మందిని థాయ్ లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ప్రవీణ్ మనీ ల్యాండరింగ్ ఆరోపణల ఎదుర్కొన్నారు. ఈడి నిర్వహించిన సోదాల్లో ప్రవీణ్ కుమార్ బాలీవుడ్, టాలీవుడ్ తారలకు రూ. లక్షల్లో పారితోషకం ఇచ్చినట్లు తేలింది. ఈడీ చికోటి ప్రవీణ్ కేసును విచారించింది. తాజాగా చికోటి ప్రవీణ్ ను థాయ్ లాండ్ పోలీసుల అరెస్ట్ చేశారు.
థాయ్ లాండ్ లో పెద్ద మొత్తంలో గ్యాంబ్లింగ్ ను చికోటి ప్రవీణ్ ఆధ్వర్యంలో ఓ ముఠా నిర్వహిస్తుంది. పక్క సమాచారంతో ఈ ముఠాపై థాయ్ లాండ్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 93 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో నలుగురు మయన్నార్ దేశస్తులు కాగా ఆరుగురు థాయ్ లాండ్ కే చెందిన వారు. ఈ ముఠా తొలుత పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేసింది. అయితే పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ గ్యాంబ్లింగ్ లో ఓ మహిళ కీలకంగా వ్యవహరించారని పోలీసులు నిర్ధారించారు. 25 సెట్ల ప్లేయింగ్ కార్డ్స్, గేమింగ్ చిప్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక అరెస్టైన వారిలో చికోటి ప్రవీణ్ తో పాటు మాధవరెడ్డి, దేవేందర్ రెడ్డిని కూడా ఉన్నారు. అరెస్టైన ముఠాలో 16 మంది మహిళలు ఉన్నారు.
అక్కడ రూ.100కోట్ల బెట్టింగ్ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అత్యాధునికి టెక్నాలజీ తో ఈ జూదం ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పటాయాలో ఏప్రిల్ 27 నుంచి ఓ హోటల్ లో కాన్ఫరెన్స్ హాల్ ను చీకోటి ప్రవీణ్ అద్దెకు తీసుకున్నారు. థాయ్ లాండ్ కు చెందిన మహిళతో కలిసి చికోటి ప్రవీణ్ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నాడు. ఆ హోటల్ లో గ్యాంబ్లింగ్ డెన్ ను చికోటి ప్రవీణ్ ఏర్పాటు చేశాడు. జూదమాడేందుకు పెద్ద సంఖ్యలో ఇండియన్స్ థాయ్ లాండ్ కి ప్రవీణ్ తీసుకెళ్లాడు. థాయ్ లాండ్ లో జూదంపై చట్టపరంగా నిషేధం ఉంది. మరి.. థాయ్ లాండ్ లో చికోటి ప్రవీణ్ అరెస్ట్ పై మీఅభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.