ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. మనుషులు ప్రమాదం కలిగించే వస్తువులతో సహజీవనం చేస్తున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ కూడా ఒక బాంబే. అది ఎప్పుడు పేలుతుందో చెప్పలేము. ఇంట్లో గ్యాస్ సిలిండర్, వస్తువుల యొక్క బ్యాటరీలు, విద్యుత్ వస్తువులు ఇలా వేటికీ పేలవు అన్న గ్యారంటీ లేదు. వెధవ గ్యారంటీ వస్తువులకు ఎందుకు, మనుషుల ప్రాణాలకు లేనిది. ఇలా మనిషి ఎప్పుడు పేలిపోతాయో తెలియని వస్తువులతో సహజీవనం చేస్తున్నాడు. సరే ఈ స్మార్ట్ ఫోన్లు, బ్యాటరీలు అంటే కొంచెం రిస్క్ తక్కువ. కానీ కెమికల్స్ కి సంబంధించిన వస్తువులతోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటి రియాక్షన్ ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయలేము. వాటిని కదిపితే విస్ఫోటనమే. గ్యాస్ తయారీ కంపెనీలు, ఆయిల్ కంపెనీలు వంటివి ఇలాంటి విషయాల్లో చాల జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అశ్రద్ధ వహించిన చాలా ఆస్తి నష్టం జరుగుతుంది.
అయితే తెలంగాణాలో ఇలాంటి ఘటనే జరిగింది. తెలంగాణాలో నిజామాబాద్ లో పేలుడు సంభవించింది. నిజామాబాద్ పట్టణంలో బడా బజార్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయభ్రాంతులకు గురయ్యారు. అయితే బడా బజార్ ప్రాంతంలోని కెమికల్ బాక్స్ ను కదిలించడం వల్ల ఈ పేలుడు సంభవించిందని పోలీసులు వెల్లడించారు. కెమికల్ బాక్స్ పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకురావడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో క్షతగాత్రుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. పేలుడు సంభవించిన వెంటనే తమకు సమాచారం అందిందని, కెమికల్ బాక్స్ ను కదిలించినప్పుడు ఈ ప్రమాదం సంభవించిందని గాయపడిన వ్యక్తి తెలిపినట్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెల్లడించారు.