హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తూ ఇంట్లోకి చొరబడి నగలు, విలువైన వస్తువులు, డబ్బులు దోచుకెళ్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో చైన్ స్నాచింగ్ దొంగలు ఎక్కువయ్యారు. అచ్చం ఇలాగే మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోసల్ మీడియాలో వైరల్ అయింది.
గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తూ ఇంట్లోకి చొరబడి నగలు, విలువైన వస్తువులు, డబ్బులు దోచుకెళ్తున్నారు. మరీ ముఖ్యంగా చైన్ స్నాచింగ్ దొంగలు ఎక్కువయ్యారు. రోడ్డుపై మహిళలనే టార్గెట్ గా చేస్తూ సైలెంట్ గా వారి మెడలో ఉన్న బంగారు గొలుసులను లాగేసుకుని తుర్రుమని అక్కడి నుంచి పరారవుతున్నారు. అయితే అచ్చం ఇలాగే తాజాగా చైన్ స్నాచర్లు పట్టపగలు నడిరోడ్డుపై ఓ మహిళకు ఊహించని షాక్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ అవుతోంది.
హైదరాబాద్ నగరంలో గత కొంత కాలంగా కొందరు యువకులు చైన్ స్నాచింగ్ కు పాల్పడుతూ మహిళలకు షాకిస్తున్నారు. అయితే తాజాగా మెదక్ జిల్లాలో సైతం ఇద్దరు యువకులు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. విషయం ఏంటంటే? జిల్లాలోని రామయంపేటలో ఓ మహిళ నడి రోడ్డుపై నిలబడి అటు ఇటు చూస్తుంది. ఆమెను ఇద్దరు చైన్ స్నాచర్స్ గమనించారు. మాస్క్ ధరించి మెల్లగా బైక్ పై వెళ్లి ఆమె వెనకాల నిలబడ్డారు. ఏం తెలియనట్టుగా నటిస్తూ క్షణాల్లోనే ఆమె మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఏం జరిగిందని ఆ మహిళ తెలుసుకునే లోపే ఆ యువకులు బైక్ పై అక్కడి నుంచి పరారయ్యారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే ఇదే వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ అయింది. పోలీసులు ఇలాంటి చైన్ స్నాచింగ్ కు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నా.. దొంగల ఆలోచనల్లో మార్పు మాత్రం కనిపించడం లేదు.
— Hardin (@hardintessa143) March 18, 2023