ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఎన్నో వినూత్నమైన పథకాలు అందుబాటులోకి తీసుకు వస్తుంది. ముఖ్యంగా మహిళల కోసం.. ఇందులో భాగంగా మాత శిశు మరణాలు తగ్గించడం కోసం పూర్తి స్థాయిలో నియంత్రణ చర్యలు చేపట్టే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలు జరిగే విధంగా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని.. దానితోపాటు సిజేరియన్ ప్రసవాలను పూర్తిస్థాయిలో తగ్గించాలని తెలిపారు. అంతే కాదు సిజేరియన్లను పూర్తి స్థాయిలో తగ్గించి సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇక ముందు గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే విధంగా చైతన్యం తీసుకు రావాలని.. ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు ప్రతినెల స్కానింగ్, అవసరమైన పరీక్షలను నిర్వహిస్తూ సుఖ ప్రసవం అయ్యే విధంగా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ క్రమంలో నార్మల్ డెలివరీ చేసిన వైద్య బృందాలకు రూ.3 వేల చోప్పున ఇన్సెంటీవ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నేడు జీవో విడుదల చసింది. కాగా, డెలివరీ కోసం చేసే సీ సెక్షన్ సర్జరీల్లో తెలంగాణ దేశంలోనే టాప్‌లో ఉంది. ఇక దేశ వ్యాప్తంగా తెలంగాణలో జరిగే ప్రసవాల్లో 60.7 శాతం సిజేరియన్లే. ఇది దేశ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువ.
సాధారణ ప్రసవం కాని మహిళలకు బిడ్డను బయటకు తీయడానికి ఆపరేషన్లు చేస్తుంటారు. వీటినే సిజేరియన్లు అని, సీ సెక్షన్ సర్జరీ అని అంటారు. ఒకప్పుడు తెలంగాణలో ఇలాంటి సౌకర్యాలు లేక మతా శిశు మరణాలు ఎక్కువగా ఉండేవి.. కానీ ఇప్పుడు అధునాతన సదుపాయాలు వచ్చాయి.. ఆ సదుపాయం వచ్చిన తర్వాత వైద్యులు ఎంతోమంది ప్రాణాలను కాపాడగలిగారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.