దేశం ఎంతగా అభివృద్ది చెందుతున్నా.. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కులం కట్టుబాట్లు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంటాయి.. సామాన్యుల నుంచి రాజకీయ నేతల వరకు కులం ప్రస్తావన లేకుండా ఉండలేరు.
ప్రపంచ దేశాలతో భారత దేశం పోటీ పడి ముందుకు సాగుతుంది. విద్యా, వైద్య, వైజ్ఞానిక రంగాల్లో ఎన్నో విజయాలు సాధిస్తుంది. దేశ వ్యాప్తంగా ఎంతో మంది విద్యావంతులు ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. టెక్నాలజీ పెరిగిపోతుంది.. కానీ కొన్ని చోట్ల ఇప్పటికీ మూఢ నమ్మకాలు, కులం, మతం అంటూ పట్టింపులు కొనసాగుతూనే ఉన్నాయి. మొదటి సారిగా పాఠశాల రికార్డుల్లో కుల ప్రస్తావన లేకుండా చూడాలని సంచలన నిర్ణయం తీసుకుంది ఓ రాష్ట్రం. ఇంతకీ అది ఏ రాష్ట్రం అన్న వివరాల్లోకి వెళితే..
ప్రస్తుత సమాజంలో కుల ప్రస్తావన లేకుండా ఏ పనులు జరగడం లేదు. ఇప్పటికీ గ్రామాల్లో కులం కట్టుబాట్లు కళ్లకు కట్టినట్లు కనబడతాయి. నగరాల్లో కూడా కులాన్ని ప్రస్తావించాకే ఇల్లు కూడా అద్దెకు ఇచ్చే పరిస్థితులున్నాయి. రాజకీయ పరంగా ఎక్కువగా కులప్రస్తావన ఎదుర్కోవలసి వస్తుంది. రాజకీయ నాయకులు ఓట్ల కోసం కులం ఓట్లను, ఇతరుల ఓట్లను విశ్లేషణ చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే తరాల్లో కూడా కుల వివక్ష ఏర్పడే అవకాశం ఉంది.ఈ పరిస్థితులను ఎదుర్కునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంపై నోటీసులు ఇవ్వనుంది.
తెలంగాణ ప్రభుత్వం స్కూల్ రికార్డుల్లో కులప్రస్తావన తేవద్దంటూ హైదరాబాద్ కు చెందిన బీహెచ్ ఈఎల్ మాజీ మేనేజర్ నారాయణ లేఖ రాశారు. ఈ లేఖను హైకోర్టు పిల్ గా స్వీకరించింది. దీనిపై డివిజన్ బెంచ్ విచారించింది. కౌంటర్ దాఖలు చేయాలని చీఫ్ సెక్రటరీ, పాఠశాల విద్యాశాఖ అధికారులకు నోటీసులు అందించింది. తదుపరి విచారణ జూలై 31కి వాయిదా పడింది. దీనిపై నారాయణ మాట్లాడుతూ.. ‘కుల ప్రస్తావన వల్ల విద్యార్థుల్లో వివక్ష ఏర్పడే ప్రమాదం ఉందని, టీసీల్లో కుల ప్రస్తావన లేకుండా చూసేలా ప్రభుత్వం ఆదేశాలివ్వాలి’ అని తెలిపారు.కుల వ్యవస్థ నివారణకు తోడ్పడాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.