మహిళలు గతంలా కాకుండా ఏదో ఒకటి పని చేసి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. సొంత కాళ్లమీద నిలబడాలన్న కోరికతో వ్యాపారాన్ని చేస్తున్నారు. అయితే ఎటువంటి బిజినెస్ చేయాలో తెలియక ఆగిపోతున్నారు. అటువంటి వారికే మంచి అవకాశంగా మారింది ఈ బిజినెస్. ఈ బిజినెస్ ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది.
మహిళలు గతంలా కాకుండా ఏదో ఒకటి పని చేసి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. కాస్త చదువుకున్న మహిళలు ఉద్యోగాల వైపు వెళుతుంటే..మరికొందరు సొంత కాళ్లమీద నిలబడాలన్న కోరికతో వ్యాపారాన్ని చేస్తున్నారు. ఖాళీ సమయాలను కూడా వృథా చేయడం లేదు. ఏదో ఒక ఆదాయ మార్గాన్ని అన్వేషిస్తూ ముందుకు సాగుతున్నారు. భర్తకు సపోర్టుగా, బిడ్డల చదువులకు,ఇతర అవసరాలకు తమ సంపాదనను వినియోగిస్తున్నారు. అయితే కొంత మంది మహిళలకు వ్యాపారం చేయాలన్న తపన ఉంటుంది కానీ, ఏం చేయాలో, ఎటు వెళ్లాలో తెలియక మదనపడి పోతుంటారు. అటువంటి వారికే మంచి అవకాశంగా మారింది ఈ బిజినెస్. ఈ బిజినెస్ ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది.
ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ల తీరు పూర్తిగా మారిపోయింది. గతంలో ఐదు రోజుల పండుగ ఉంటే.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు చేయడానికి, ఇతర పనులకు వినియోగించారు. పెరుగుతున్న కల్చర్‌కు అనుగుణంగా ఇప్పుడు రోజుకో పెస్టివల్ చేస్తున్నారు. అబ్బాయిలు బ్యాచ్ లర్ పార్టీ చేసుకున్నట్లే.. స్త్రీలంతా ఓ చోట చేరి మెహందీ వేడుకలను చేస్తున్నారు. దీని కోసం ఓ రోజును కేటాయిస్తున్నారు. మెహందీ పెట్టుకుని.. పెద్ద వేడుకలా చేస్తున్నారు. ఈ మెహందీ వేడుక కోసం ప్రత్యేకంగా మెహందీ డిజైనర్‌లను పిలిపిస్తున్నారు. వారి కోసం పెద్ద మొత్తంలో వెచ్చిస్తున్నారు. ఇప్పుడు ఇదొక కెరీర్ ఆప్షన్‌గా మారిపోయింది. దీని కోసం ప్రత్యేకమైన శిక్షణనిస్తున్నారు. దీని ద్వారా మంచి ఆదాయం కూడా ఆర్జిస్తున్నారు మహిళలు.
అయితే తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం మెహందీ శిక్షణ కోర్సులను నేర్పిస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సెట్విన్ సంస్థ మెహందీ డిజైనింగ్ కోర్సులను నేర్పిస్తోంది. చదువుతో సంబంధం లేకుండా మహిళలందరికీ ఈ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ రుసుము కింద రూ. 1500లను తీసుకుంటుంది. అంతేకాదు ఈ శిక్షణ అనంతరం సర్టిఫికెట్ కూడా జారీ చేస్తారు. ఈ శిక్షణ తీసుకున్నాక ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటే.. ఆదాయాన్ని ఆర్జించవచ్చు. పెళ్లిళ్లకు ఇతర శుభకార్యాలయాలకు ఏక మొత్తంగా మాట్లాడుకుని ఆదాయన్ని గడించవచ్చు. డిజైన్ బట్టి రూపాయలను వసూలు చేసుకోవచ్చు.
చేతి నుండి మడికట్టు వరకు వేసే డిజైన్లకు ఒక్కొక్క రేటు ఉంటుంది. పెళ్లి కుమార్తె, ఫంక్షన్ బట్టి మాట్లాడుకోవచ్చు. 500 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు చార్జ్ చేస్తున్నారు. అంతేకాకుండా పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్, బ్యూటీ పార్లరలో స్టాల్ ఏర్పాటు చేసుకుని..ఆదాయం పొందవచ్చు. అలాగే మెహందీ డిజైన్ నేర్పిస్తూ కూడా ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ఆన్లైన్ తరగతుల ద్వారా కూడా మీరు ఈ మెహందీ డిజైన్ కోర్సులను ఇతర విద్యార్థులకు నేర్పించి మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది.