ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవడానికి ప్రయాణికులు కోరిన చోట బస్సును ఆపి ఎక్కించుకోవడం, దించడం చేసిన ఆర్టీసీ మరో అడుగు ముందుకేసింది. ఫోన్ చేస్తే.. ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు అంటూ ప్రయాణికుల ఇంటి వద్దనే సేవలందించేదుకు రెడీ అయ్యింది. సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లే ప్రయాణికులు ఒకే ప్రాంతంలో 30 మంది ఉంటే వారి ప్రాంతం, వారి కాలనీకి బస్సును పంపిస్తామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని ప్రయాణికులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. దీనికి ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. సమచారం కోసం ఎంజీబీఎస్ : 9959226257, జేబీఎస్ : 9959226246, రేతిఫైల్ బస్ స్టేషన్ 9959226154, కోఠి బస్ స్టేషన్ : 9959226160 నెంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.
ప్రయాణిక దేవుళ్ళందరికి మంగిడీలు!! అదనపు ఛార్జీలు లేవు. వివరాలకు MGBS: 9959226257, JBS: 9959226246 నెంబర్ లపై సంప్రదించండి #ChooseTSRTC @TSRTCHQ @puvvada_ajay @Govardhan_MLA @TV9Telugu @eenadulivenews @sakshinews @DDYadagiri @airnews_hyd @Telugu360 #Sankranthi2022 #mondaythoughts pic.twitter.com/U3yLyvyacv
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) January 10, 2022