భారత రాష్ట్ర సమితి(BRS) సంచలన నిర్ణయం తీసుకుంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావులపై వేటు వేసింది. వారిద్దరిని బీఆర్ఎస్ అధిష్టానం సస్పెండ్ చేసింది.
భారత రాష్ట్ర సమితి(BRS) సంచలన నిర్ణయం తీసుకుంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావులపై వేటు వేసింది. వారిద్దరిని బీఆర్ఎస్ అధిష్టానం సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడారని వారిద్దరిపై బీఆర్ఎస్ వేటు వేసింది. ఖమ్మం ఆత్మీయ సమ్మేళన సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీపై ఇద్దరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాక గత కొంతకాలం నుంచి వీరిద్దరు పార్టీకి వ్యతిరేకంగా స్వరం వినిపిస్తున్నారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస రెడ్డి తరచూ వివిధ నియోకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా స్వరం పెంచారు.
దీంతో సీరియస్ గా తీసుకున్న గులాబీ బాస్, పార్టీ నుంచి వారిద్దరిని సస్పెండ్ చేశారు. ఈక్రమంలో బీఆర్ఎస్ పేరుతో చెత్తపాలన దేశానికి ఇస్తారా? అంటూ జూపల్లి కృష్ణరావు కామెంట్స్ చేశారు. తెలంగాణలో పాలన ఎప్పుడో గాడి తప్పిందంటూ జూపల్లి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలానే సస్పెన్షన్ కి గురైన పొంగులేటీ..సీఎం కేసీఆర్ పై హాట్ కామెంట్స్ చేశారు. ఇక కేసీఆర్ శకం ముగుస్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ తనపై వేటు వేయడంతో పొంగులేటీ తన అనుచరులతో ఖమ్మంలో భేటి కానున్నారు. వారితో చర్చించి భవిష్యత్ కార్యచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం..పార్టీలో వ్యతిరేక స్వరం వినిపించే వారికి పరోక్ష హెచ్చరికని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.