భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావం తరువాత తొలిసారిగా నిర్వహించిన ఖమ్మం సభ ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ సభకు కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ఖమ్మం పట్టణం అంతా గులాబిమయం అయ్యింది. ఈ సభకు తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవత్ మాన్ , కేరళ సీఎం పినరయి విజయన్ హాజరయ్యారు. అలానే సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, యూపీ మాజీ ముఖ్య మంత్రి అఖిలేష్ యాదవ్ కూడా ఈ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీరుపై కేసీఆర్ తో సహా అక్కడ విచ్చేసిన జాతీయనేతలు విరుచకపడ్డారు. గవర్నర్లపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తుందని , కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం త్వరలో గద్దె దిగనుందంటూ నేతలు తీవ్ర స్థాయిలో విరుచకపడ్డారు. ఖమ్మలో జరిగిన ఈ సభ దేశంలో ప్రబల మార్పుకు సంకేతమని సీఎం కేసీఆర్ అన్నారు.
ఇంకా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ” భారతదేశం తన గమ్యాన్ని కోల్పోయిందా? ప్రస్తుతం దేశంలో విచిత్రమైన పరిస్థితి ఉంది. దేశంలో 83 కోట్ల సాగు భూములు ఉన్నాయి. కానీ, ఇంకా యాచకులుగానే ఎందుకు ఉండాలి? . ప్రభుత్వాల మెడలు వచ్చేలా పోరాటం జరగాలి. రాష్ట్రాల మధ్య కేంద్రం గొడవలు పెడుతోంది. రాష్ట్రాల మధ్య గొడవలకు కారణం కాంగ్రెస్, బీజేపినే. బీజేపీది ప్రైవేటైజేషన్ అయితే బీఆర్ఎస్ ది నేషనలైజేషన్. కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలను తాము రద్దు చేస్తాము. ముఖ్యంగా అగ్నిపథ్ ను రద్దు చేస్తాము. విశాఖ ఉక్కును ప్రైవేటు పరంగా కాకుండా చూస్తాం. 2024 ఎన్నికల తరువాత మెడీ ఇంటికి.. మేము ఢిల్లీకి వెళ్తాము” అని సీఎం కేసీఆర్ అన్నారు.
ఇదే వేదిక నుంచి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగించారు. కేసీఆర్ తమకు పెద్దన్నలాంటి వారని, గవర్నర్లు కేంద్రం చేతిలో కీలు బొమ్మలు గా మారారని వ్యాఖ్యానించారు. కంటి వెలుగు అద్భుతమైన కార్యక్రమం అంటూ సీఎం కేసీఆర్ పై కేజ్రీవాల్ ప్రశంసలు కురిపించారు. ఢిల్లీ, పంజాబ్ లో కూడా ఈ పథకాన్ని తీసుకువస్తామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఆదేశాలతో ఇక్కడి గవర్నర్ తమిళసై ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారంటూ ఘూటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో కేరళ సీఎం పినరయి విజయన్ కూడా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచపడ్డారు. దేశ సార్వభౌమత్వానికి ఇది పరీక్షా సమయమని, రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని విజయన్ అన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో అధికార వికేంద్రీకరణ జరుగుతోందని తెలిపారు.
బీజేపీయేతర రాష్ట్రాలను కేంద్రం ఇబ్బంది పెడుతోందిని, విపక్ష నేతలను కేసుల పేరుతో బీజేపీ ప్రభుత్వం వేధిస్తోందని యూపీ మాజీ సీఎం , సమావాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. దేశమనే పుప్ప గుచ్ఛంలో అన్నిరకాల పూలు ఉంటేనే బాగుంటుందని, కానీ కొందరు ఒకే రంగు మాత్రం ఒకే రంగు పువ్వు ఉండాలని కోరుకుంటున్నారని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ అన్నారు. బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ అని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచకపడ్డారు. అలానే సీపీఐ నేత రాజా కూడా బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇక సభ విషయానికి వస్తే.. సభకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సైతం భారీగా తరలిచవచ్చారు. దేశ రాజకీయాల్లో పెను మార్పులు ఈ సభనుంచి అడుగులు ప్రారంభమయ్యాని పలువురు బీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడ్డారు. మరి.. బీజేపీపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచకపడ్డారు. మరి..ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.