జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టిన బీఆర్ఎస్ పార్టీ మరాఠా గడ్డపై తొలి విజయాన్ని నమోదు చేసింది. మహారాష్ట్ర పాలిటిక్స్ మీద పూర్తి ఫోకస్ చేసిన బీఆర్ఎస్.. పక్క ప్రణాళికతో ముందుకెళ్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై దృష్టిసారించిన విషయం మనందరికి తెలిసిందే. అందులో భాగంగానే ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ అని పేరు పెట్టి.. జాతీయ పార్టీగా మార్చారు. రాబోయే ఎన్నికల్లో జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలనే వ్యూహంతో కేసీఆర్ ముందుకెళ్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వివిధ రాష్ట్రాల్లో యాక్టీవ్ గా ఉంది. మహారాష్ట్ర, ఒడిశా,ఏపీ వంటి రాష్ట్రాలో బీఆర్ఎస్ లోకి పలువురు చేరారు. బీఆర్ఎస్ గా మారిన తరువాత తెలంగాణలో మినహా ఏ రాష్ట్రంలోనూ బోణి కొట్టలేదు. అయితే మహారాష్ట్ర గడ్డపై తొలిసారి బీఆర్ఎస్ బోణి కొట్టింది.
భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోను తన సత్తా చాటేందుకు ఉవ్విళ్లురూతుంది. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో కుమారస్వామికి మద్దతు ఇచ్చిన.. అక్కడ ఆశించిన ఫలితం దక్కలేదు. అలానే తెలంగాణ బయట ఏ రాష్ట్రంలోను ఇప్పటి వరకు బీఆర్ఎస్ కు విజయం దక్కలేదు. అయితే తాజాగా మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ తొలి విజయం సాధించింది. మహారాష్ట్రలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థి వార్డు సభ్యుడిగా గెలుపొంది.. గులాబీ జెండా ఎగరేశారు.
జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత మహారాష్ట్రపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు బీఆర్ఎస్ తొలి విజయం అందుకుంది. ఈ విజయంతో మరాఠలోని బీఆర్ఎస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా గంగాపూర్ తాలూకాలోని అంబేలోహల్ గ్రామంలో మే 18 జరిగిన గ్రామ పంచాయతీ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బీఆర్ఎస్ అభ్యర్థి పోటీ చేసిన గఫర్ సర్దార్ పఠాన్.. ప్రత్యర్థిపై 115 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గత నెలల్లోనే ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఆ సభ అనంతరం గులాబీ పార్టీకి ఇదే తొలి విజయం కావటం విశేషం. దేశ రాజకీయాల్లోకి ప్రవేశించిన బీఆర్ఎస్ పార్టీ.
తొలుత మహారాష్ట్రపైనే దృష్టి పెట్టింది. అందుకు తగినట్లే అక్కడి నుంచి పెద్ద ఎత్తున చేరికలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరాఠా గడ్డపై గులాబీ బాస్ భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించారు. మహారాష్ట్రలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు అన్ని రకాలుగా సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే రోజుల్లో.. మరిన్ని విజయాలు కూడా అందుకుని.. మరాఠా గడ్డపై గులాబీ జెండా సత్తా చూపిస్తామంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. మరి.. మహారాష్ట్రలో బీఆర్ఎస్ సాధించిన తొలి విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.