మనీలాండరింగ్ కేసులో శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్‌తో చాట్ చేసినట్లు జరుగుతున్న ప్రచారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు.
మనీలాండరింగ్ కేసులో అరెస్టయి జైలులో శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ తన లాయర్ ద్వారా బుధవారం (ఏప్రిల్ 12) విడుదల చేసిన లేఖ సంచలనం రేపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో తాను చాట్ చేసినట్లుగా చెబుతూ.. సుఖేష్ కొన్ని స్క్రీన్ షాట్లను విడుదల చేశాడు. ఎమ్మెల్సీ కవిత పేరును ఆ చాట్‌లో ‘కవిత అక్క టీఆర్ఎస్’గా అతడు సేవ్ చేసుకున్నాడు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సుఖేష్ విడుదల చేసిన వాట్సాప్ స్క్రీన్ షాట్లతో రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సుఖేష్ వాట్సాప్ చాట్ వ్యవహారంపై తాజాగా ఎమ్మెల్సీ కవిత స్పందించారు. సుఖేష్‌తో తనకు ఎలాంటి పరిచయం లేదని ఆమె స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ మీద ఫేక్ చాట్లతో కావాలనే దుష్ప్రచాచారం చేస్తున్నారని కవిత అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం లేక తనపై ఈ విధంగా దాడి చేస్తున్నారని ఆమె ఫైర్ అయ్యారు. ఒక ఆర్థిక నేరగాడు నేరగాడు, ఓ అనామకు లెటర్‌ను విడుదల చేస్తే దాన్ని పట్టుకుని కొందరు రాద్ధాంతం చేస్తున్నారని చెప్పారు. అసలు సుఖేష్ ఎవరో తనకు తెలియదని.. అతడితో పరిచయం కూడా లేదన్నారామె. బీజేపీ టూల్కిట్లో భాగమే ఈ బురదజల్లే కార్యక్రమం అని ఆమె ఆరోపించారు. నిజానిజాలు తెలుసుకోకుండా కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని కవిత సీరియస్ అయ్యారు.
తెలంగాణ బిడ్డలం తలవంచం.. తెగించి కొట్లాడుతాం..!
జై తెలంగాణ… జై భారత్ pic.twitter.com/f8ha3TF7Sa
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 13, 2023