ఆ ఇంట్లో మేళ తాళాలు, బాజా భజంత్రీల చప్పుళ్లు మారుమోగాల్సి ఉండగా చావు డప్పు మోగింది. బంధుమిత్రులతో సందడిసందడిగా ఉండాల్సిన ఆ ఇల్లు ఏడుపులు, శోకాల వినిపించాయి. కుమార్తెకు పెళ్లి చేసి.. అత్తారింటికి పంపాల్సిన తండ్రి.. కాంటికి వెళ్లాడు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఓ మధురమైన జ్ఞాపకం. అందుకే ఈ వేడుకను ఎంతో ఘనంగా జరుపుకోవాలి యవత భావిస్తుంది. ఎన్నో జంటలు తమ వివాహ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే ఇలా ఎంతో సంతోషంగా జరుపుకుని ఈ పెళ్లి వేడుకల్లో కొన్ని సార్లు విషాదాలు చోటుచేసుకుంటాయి. తాజాగా ఓ ఇంట్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగింది. బంధువు మిత్రులతో సందడిగా ఉండాల్సిన ఆ ఇల్లు ఏడుపులు, శోకాలు వినిపించాయి. బిడ్డను అత్తారింటికి పంపాల్సిన ఇంటి పెద్దను కాంటికి పంపాల్సి వచ్చింది. పెళ్లి కుమార్తె తండ్రి గుండెపోటుతో మరణించాడు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామానికి చెందిన చింతేటి అర్జున్ రావు(42)వీఆర్వోగా పనిచేసేవాడు. అయితే ప్రభుత్వం వీఆర్వో వ్వవస్థను రద్దు చేయడంతో వైద్య ఆరోగ్యశాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. ఇటీవలే అర్జున్ రావు కుమార్తెకు వివాహం నిశ్చమైంది. శుక్రవారం రాత్రి పెళ్లి జరగాల్సి ఉంది. ఈక్రమంలో అర్జున్ రావు కుటుంబం పెళ్లి పనుల్లో ఫుల్ బిజీగా ఉంది. అలానే ఆయన కూడా కుమార్తె పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాడు. బంధువులు, స్నేహితులందరీకి పెళ్లి పత్రికలు ఇచ్చి.. ఆహ్వానించాడు.
గురువారం ఉదయం కూడా భార్యతో కలిసి అర్జున్ రావు మరికొందరికి ఆహ్వాన పత్రికలు ఇచ్చి వచ్చాడు. శుక్రవారం పెళ్లి కావడంతో గురువారం సాయంత్రానికి చాలామంది దగ్గరి బంధువులు అర్జున్ రావు ఇంటికి వచ్చారు. పిల్లాపాపలతో, బంధుమిత్రులతో ఆయన ఇల్లంతా కోలాహలంగా మారింది. ఆయన కూడా పెళ్లి ఏర్పాట్లను చూసి ఎంతో సంతోష పడ్డారు. అయితే వీరి ఆనందాన్ని చూసి విధికి కన్నుకుట్టింది. అంతల్లోనే ఆ ఇంట్లో విషాదం నింపింది. అప్పటి వరకు అందరితో ఎంతో సంతోషంగా గడిపిన అర్జున్ రావుకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది.
దీంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. దీంతో పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ కుటుంబంలో విషాదం నెలకొన్నది. తన తండ్రి.. తనకు పెళ్లి చేసి.. సంతోషంగా అత్తారింటికి పంపుతాడని కాబోయే పెళ్లి కూతురు భావించింది. తండ్రి మరణం తట్టుకోలేక గుండెలు పగిలేలా రోధించింది మృతుడి కుమార్తె. అలానే స్థానికులు, బంధుమిత్రులను ఈ ఘటన కలచివేసింది