నాగరాజు, మౌనిక ప్రేమికులు. డిగ్రీ టైంలో పరిచయం కావడంతో ఇద్దరూ ఇష్టపడ్డారు. దీంతో అప్పటి నుంచి ప్రేమించుకున్నారు. అలా వీరి ప్రేమాయణం ఏకంగా 6 ఏళ్లు కొనసాగింది. కట్ చేస్తే.. ప్రియుడు ఇచ్చిన షాక్ తో ప్రియురాలు నెత్తి, నోరు బాదుకుంది. అసలేం జరిగిందంటే?
వాళ్లిద్దరు ఇష్టపడ్డారు. చాలా ఏళ్లుగా ప్రేమించుకున్నారు. కలిసి సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగి బాగానే ఎంజాయ్ చేశారు. ఇక అంతా బాగానే ఉందనుకున్న తరుణంలోనే ఆమె ప్రియుడు ఊహించని షాకిచ్చాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ప్రియురాలికి ప్రియుడు ఇచ్చిన షాక్ ఏంటి? అసలేం జరిగిందంటే? కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తూజాల్ పూర్ గ్రామంలో నాగరాజ్ గౌడ్ అనే యువకుడు నివాసం ఉండేవాడు. అయితే డిగ్రీ చదువుకునే రోజుల్లో ఇతడికి దోమకొండకు చెందిన మౌనిక అనే యువతితో పరిచయం ఏర్పడింది.
ఈ పరిచయం కాస్త రాను రాను ప్రేమగా మారింది. అలా ఇద్దరూ ఏకంగా 6 ఏళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగారు. ఇక ప్రియుడితో అన్నీ చేసిన ఆ యువతి.. ఎలాగైన నాగరాజ్ నే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఇందులో భాగంగానే ఇటీవల ఆ యువతి పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడు నాగరాజ్ కి తెలిపింది. ప్రియురాలి మాటలు విన్న నాగరాజ్ ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. పెళ్లి చేసుకునేది లేదంటూ తేల్చి చెప్పాడు. ప్రియుడు అలా చెప్పడంతో ఆ యువతికి ఏం చేయాలో అస్సలు తోచలేదు. ఇక చేసేదేం లేక ఏకంగా ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. పెళ్లి చేసుకోవాలంటూ నిరసనకు దిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు మోసం చేస్తున్నాడంటూ వాపోయింది. దీంతో ఆ యువతికి పలువురు మద్దతు తెలిపినట్లుగా తెలుస్తుంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.